KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ కోర్టు నోటీసులు!

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ ఇష్యూలో కేసీఆర్, హరీశ్‌రావుతోపాటు 8 మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీచేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 5న బాధ్యులంతా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

New Update
KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ కోర్టు నోటీసులు!

Bhupalpalli: మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ ఇష్యూలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను పరిశీలించిన భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కేసీఆర్, హరీశ్‌రావుతోపాటు 8 మందికి నోటీసులు జారీచేసింది. అంతేకాదు వీరందరూ సెప్టెంబరు 5న విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఎలాంటి చర్యలు తీసుకోలేదు..
ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై 2024 అక్టోబరు 25న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నాగవెల్లి రాజలింగమూర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్రమంలో జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మొదట ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేస్తే తన పిటిషన్‌ను కొట్టివేసిందని చెప్పారు. దానికి కారణాలను కూడా తనకు తెలియజేయలేదని, ఆ పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించానన్నారు. తర్వాత రివిజిన్ పిటిషన్‌ను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా సూచించడంతో ఇప్పుడు దాఖలు చేయాల్సి వచ్చిందని రాజలింగమూర్తి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Shadnagar: దొంగతనం నెపంతో దళిత మహిళపై ఇన్స్పెక్టర్ థర్డ్ డిగ్రీ.. సీఎం రేవంత్ సీరియస్!

స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు..
అలాగే బ్యారేజీలోని 7 బ్లాకులో పిల్లర్ కుంగిపోవడం, ఒక పిల్లర్‌కు పగుళ్ళు రావడంపై అసిస్టెంట్ ఇంజినీర్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే దీనిపై తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉందనే భావించిన పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 427 ప్రకారం ఎఫ్ఐఆర్ (నెం. 174/2023) నమోదు చేసి ఒక్కరోజు వ్యవధిలోనే దానిని క్లోజ్ చేసినట్లు రాజలింగమూర్తి ఫిటిషన్ లో వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ)కు డిజైన్, నిర్మాణంలో కేసీఆర్, హరీశ్‌రావుతోపాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇంజినీర్-ఇన్-చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ‘మెఘా’ నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ ప్రతినిధులను బాధ్యులుగా ఫిటిష్ లో సూచించారు. దీంతో వీరందరికీ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జీ నోటీసులు జారీచేశారు. అయితే సెప్టెంబరు 5న జరగనున్న విచారణకు హాజరవుతారా? లేదా అనే అంశం చర్చనీయాంశమైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు