డిజైన్ టెక్ సంస్థ ఏపి స్కిల్ డెవెలప్‌మెంట్ కోసం చేసిన వెండర్ చెల్లింపులు, టాక్సుల వివరాల లేఖ బయటపెట్టిన ఎండీ వికాస్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అన్యాయమని డీజీ టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వెల్కర్ ఇంతకు ముందే చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి 2022లో డిజైన్ టెక్ సంస్థ ఏపి స్కిల్ డెవెలప్‌మెంట్ కోసం చేసిన వెండర్ చెల్లింపులు, టాక్సుల పూర్తి వివరాలతో కూడిన లేఖను బయటపెట్టారు.

New Update
డిజైన్ టెక్ సంస్థ ఏపి స్కిల్ డెవెలప్‌మెంట్ కోసం చేసిన వెండర్ చెల్లింపులు, టాక్సుల వివరాల లేఖ బయటపెట్టిన ఎండీ వికాస్

ఏపీ స్కిల్ డెవలప్‍ మెంట్ కార్పొరేషన్‍తో ఒప్పందంలో ఎలాంటి స్కాం లేదన్న డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ అన్నారు. మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరపున వీడియో కూడా విడుదల చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందంచేసుకున్న ప్రకారం 371 కోట్ల విలువైప సామాగ్రిని సప్లై చేశామని దానికి సంబంధించిన వివరాలను 2022లోనే CID DSP, ధనుంజయుడు కు పంపామని సంస్థ ఎండి వికాస్ ఖన్వెల్కర్ తెలిపారు. ఆ లేఖను ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో జీఎస్టీ స్కాం ఉందన్న ఆరోపణల్లో నిజం లేదని వికాస్ ఆరోజే చెప్పారు. ఏపీ సీఐడీ దీనికి సంబంధించి తమను ఏమీ అడగలేదని కూడా అన్నారు.

02. Documents submission to CID

అయితే ఏసీబీ స్కిల్ డెవలప్ మెంట్ పెట్టిన కేస్ రిమాండ్ రిపోర్ట్మరో విధంగా ఉంది. ఇందులో షెల్ కంపెనీల ద్వారా డబ్బులను హవాలా రూపంలో చేతులు మార్చారంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు పక్కా ఆధారాలు ఉన్నాయని కూడా ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ ప్రకటించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో డీజీ టెక్ కంపెనీపైనే అందరి చూపు మళ్ళింది. ఈ క్రమంలోనే ఆ డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ స్పందించారు. సీఐడీ ధనుంజయ్ కు పంపిన లేఖను బయటకు తీసుకువచ్చారు. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం మీద చంద్రబాబు తరుపు లాయర్లు పెట్టిన క్వాష్ పిటిషన్ విచారణను హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.

Advertisment
తాజా కథనాలు