Mayank Agarwal : విమానంలో క్రికెటర్ మయాంక్‌కు తీవ్ర అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు

నిన్న అగర్తలా-ఢిల్లీ విమానంలో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన సీటు ముందున్న ప్లాస్టిక్ కవర్‌లో ఉన్న ద్రవాన్ని మంచినీళ్ళు అనుకుని తాగడంతో అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వెంటనే విమానం ఆపి అతన్ని ఆసుపత్రికి తరలించారు.

Mayank Agarwal : విమానంలో క్రికెటర్ మయాంక్‌కు తీవ్ర అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు
New Update

Agartala to Delhi Flight : భారత(India) బ్యాటర్ మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంగళవారం అగర్తల నుంచి న్యూ ఢిల్లీ(New Delhi) వెళుతున్న విమానంలో మయాంక్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తన సీటు ముందున్న పౌచ్‌లో ఒక బాటిల్ ఉంది. అందులో నీళ్ళలాంటి ద్రవమే ఉంది. దాన్ని అతను మంచినీళ్ళు అనుకునే కొద్దిగా తాగాడు. అయితే తాగిన కొన్ని నిమిషాల్లోనే అతని నోటిలో ఇబ్బంది మొదలైంది. ఒక్కసారిగా మాట్లాడలేకపోయాడు. నోరు వాచిపోవడమే కాక నోరంతా బొబ్బలు వచ్చేశాయి. దీంతో అక్కడిక్కడే విమానం ఆపించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.

Also Read : Parliament Budget Sessions : నారీశక్తికి ప్రతీక ఈ మధ్యంతర బడ్జెట్-ప్రధాని మోడీ

మయాంక్ అంతర్జాతీయ క్రికెటర్...

మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్(International Cricket Player). రంజీట్రోఫీలో భాగంగా త్రిపుర జట్టుతో మ్యాచ్ ఆడటం కోసం కర్ణాటక టీమ్ అగర్తలాకు వచ్చింది. కర్ణాటక జట్టుకు మయాంక్ కెప్టెన్. మ్యాచ్ అయిపోయాక అతను అగర్తల నుంచి ఢిల్లీకి ఇండిగో ఎయిర్ లైన్స్‌(Indigo Airlines) లో బయలుదేరాడు. అతను కూర్చున్న ముందు సీటులోని పౌచ్‌లో బాటిల్‌లో ఏదో హానికారక ద్రవం ఉంది. దానినే అతను మంచినీళ్ళు అనుకుని తాగాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్చడం వలన పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. ఐసీయూలో చికిత్స తర్వాత మయాంక్‌ ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. దీని తర్వాత డాక్టర్ల సూచన మేరకు మయాంక్‌ను బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు...

మయాంక్‌కు జరిగిన సంఘటన గురించి అతడి మానేజర్ ఎన్సీసీపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెస్ట్ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. మయాంక్ మేనేజర్ నుంచి జరిగిందంతా తెలుసుకున్నారు. మయాంక్ పూర్తిగా కోలుకుని మాట్లాడడం మొదలుపెట్టాక అతని దగ్గర నుంచి కూడా స్టైట్ మెంట్ తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇండిగో విమాన సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఆ హానికార ద్రవం బాటిల్ విమానంలోకి ఎలా వచ్చిందన్న విషయం ఆరా తీస్తున్నారు.

Also Read : మారుతికి షాక్ ఇచ్చిన టాటా మోటార్స్..

#air-plane #mayank-agarwal #delhi #cricketer #agartala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe