Floods In China : మొన్న దుబాయ్(Dubai) లో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈరోజు చైనా(China) లో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా అక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయి. దక్షిణ చైనా ప్రాంతంలో వరదలు వణికిస్తున్నాయి. దీని ప్రభావంతో.. 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని క్వింగ్యువాన్‌లో భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. దీంతో రోడ్లు, పంట పొలాలన్నీ నీటమునిగాయి. నలుగురు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. గ్వాంగ్‌డాంగ్‌లో ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.
Also Read: ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం.. మీరు బుక్స్ చదువుతారా
ఇదిలా ఉండగా.. ఇటీవల దుబాయ్‌లోని ఒక్కరోజు వ్యవధిలోనే ఏడాదిన్నర వర్షపాతం నమోదైంది. చాలా తక్కువ పడే ఏడాది దేశంలో.. ఒక్కసారిగా వరదలు(Floods) రావడంతో అంతా అతలాకుతలం అయిపోయింది. నగరమంతా నీటిమయం అయిపోయింది. జనజీవనం స్థంభించిపోయింది. విమానాలు రద్దయిపోయాయి. అయితే దుబాయ్‌లో కురిసి కుండపోత వర్షాలు, వరదలకు కారణం క్లౌడ్ సీడింగేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ వర్షాలను కురిపించడం అనేది ప్రకృతిని ఉల్లంఘించడం వంటిదేనని అంటున్నారు. దీనివల్ల ఒకచోట అత్యధిక వర్షపాతాలు కురిస్తే.. మరో చోట అనావృష్టికి దారి తీసి కరవు ఏర్పడుతుందిని హెచ్చరిస్తున్నారు.