Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..

విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తుండగా కోకోవెన్‌ విభాగంలో ఉన్న నాఫ్తలిన్‌ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

New Update
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..

విశాఖపట్నంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది. ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్‌ విభాగంలో ఉన్న నాఫ్తలిన్‌ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. దీంతో నాఫ్తలీన్ యూనిట్‌ దగ్ధమైపోయింది. అలాగే యంత్రాలు, విద్యుత్ పరికరాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ అగ్నిప్రమాదం వల్ల భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F14 రాకెట్‌

Advertisment
తాజా కథనాలు