అడవుల్లో కూంబింగ్
దేశంలో పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సాయుధ పోరాటం సాగిస్తున్న విప్లవ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందికి వచ్చి మావోయిస్టు పార్టీగా అవతరించిన రోజూనే సెప్టెంబర్ 21న ప్రతీ ఏటా మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఉత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టు అగ్రనాయకత్వం లేఖలు కరపత్రాలు ద్వారా ప్రచారం చేయగా, తిప్పికొట్టేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా ముమ్మరంగా అడవుల్లో కూంబింగ్ చేశారు.
తీవ్రంగా నష్టపోయింది
మావోయిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత అనేక ఆటుపోట్లను ఎదుర్కొని.. అరెస్టులు, నిర్బంధాలు, ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, కరోనా దాడి, ఇలా అన్ని రకాలుగా ఆ పార్టీకి కలిసి రాక తీవ్రంగా నష్టపోయింది. పార్టీని ముందుండి నడిపించిన అగ్ర నాయకులు పటేల్ సుధాకర్‌రెడ్డి, కోటేశ్వరరావు, మాధవ్, శాఖమూరి అప్పారావు వివిధ కారణాలతో మరణించారు. 2004 తర్వాత 2017 వరకు ముఖ్యంగా దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. అడవుల్లో ఆదివాసీలు గిరిజన తెగలు వారందరికీ మావోయిస్టు పార్టీ చేరువైంది. కాగా మారుతున్న కాలానుగుణంలో పార్టీలో మార్పులు వచ్చాయి. గత 16 రాష్ట్రాల్లో ప్రభావం చూపిన మావోయిస్టు పార్టీ. ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర, ఒడిశా, మహారాష్ట్ర , తెలంగాణ రాష్ట్రాల్లో పరిమితమై అగ్ర నాయకత్వం లేక కొట్టిమిట్టాడుతుంది.
పోలీసుల హెచ్చరికలు
అనేక అవరోధాల మధ్య మావోయిస్టు పార్టీ 19 వార్షికోత్సవాలు చేపట్టింది. దీనికి దండకారణ్యం వేదికగా మారనుంది. పార్టీ ఆవిర్భావం ఎదుర్కొన్న సమస్యలపై చర్చిస్తారు. అమరులైన నాయకత్వాలను నాయకులను ఈ వేడుకలలో స్మరించుకుంటారు. ఆయా కార్యక్రమాలను దండకార్యం వేదిక కానుంది. ఇది ఇలా ఉండగా మావోయిస్టు పార్టీ 19వ వార్షికోత్సవాలు తిప్పికొట్టేందుకు ..అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వీటితోపాటుగా భద్రాద్రి జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు అడవుల్లో కూమింగ్ చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ వెళ్లే రహదారులను చెక్ పోస్ట్‌లు పెట్టి మరి తనిఖీలు ముమ్మరం చేశారు. రాత్రి వేళల్లో నడిచే ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. ఇంట్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని ఆదేశం
ఈనెల సెప్టెంబర్ 27 వరకు మావోయిస్టు పార్టీ స్థాపన దినోత్సవాన్ని.. విప్లవ ఉత్సాహంతో విప్లవ సంకల్పంతో వాడవాడలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. చర్ల శబరి ఏరియా కమిటీ ప్రధాన కార్యదర్శి అరుణ పేరుతో మావోయిస్టు లేఖ విడుదల చేశారు.నేడు మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి.. 19 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా చర్ల తదితర ప్రాంతాలలో వాడవాడలా ప్రతి గ్రామంలోనూ మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు.
అమాయక ఆదివాసీలు నివసిస్తున్న ఆదివాసి గ్రామాలను కనుమరుగయ్యే విధంగా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆదివాసి గ్రామాలను ఆధునీకరణ పేరుతో కనుమరుగయ్యే విధంగా గనులు. పర్యాటక కేంద్రాలుగా.. ఏర్పాటు చేసి ఆదివాసి జాతిని అంతమొందించే విధంగా చేస్తున్నదని దుయ్యబట్టారు. దీనికి వ్యతిరేకంగా జల్ జమీన్ జంగిల్ నినాదానికి కట్టుబడి పోరాటం చేస్తూ ఉన్నామని ఇందుకు అనుగుణంగానే మావోయిస్టు పార్టీ సెప్టెంబర్ 21 ఆవిర్భవించి 19 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వాడవాడల మావోయిస్టు ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని ఆదేశించారు.