Maoist: పోలీసు వాహనంపై మావోయిస్టుల బాంబు దాడి..

ఛత్తీస్‌గడ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టులు మందుపాతరతో పోలీస్ వాహనాన్ని పేల్చేశారు. ఘటనలో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలోని సిలిగేర్ - టేకుగూడెం రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

New Update
Maoist: పోలీసు వాహనంపై మావోయిస్టుల బాంబు దాడి..

ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దండకారణ్యంలో మందుపాతరతో పోలీస్ వాహనాన్ని పేల్చేశారు. ఘటనలో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలోని సిలిగేర్ - టేకుగూడెం రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై విచారణ ప్రారంభించారు. అయితే గత కొన్ని రోజులుగా దండకారణ్యంలో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి.

Also Read: మహిళా కానిస్టేబుల్‌తో డీఎస్పీ అక్రమ సంబంధం.. కట్ చేస్తే కానిస్టేబుల్‌గా డిమోట్

ఇప్పటివరకు మావోయిస్టులు, బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లలో దాదాపు 150 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడంతో పోలీసులపై ప్రతీకారం తీర్చుకునేందుకే బ్లాస్టింగ్‌ను ప్లాన్‌ వేశారు.

Also Read:  నీట్‌ పరీక్ష అక్రమాలపై సీబీఐ కేసు నమోదు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు