Free Current : ఫ్రీ కరెంటుకు కొత్త సవాళ్లు..!

Current Bill: విద్యుత్‌ బిల్లుల చెల్లింపులో క్యూ ఆర్‌ కోడ్‌ విధానం!
New Update

Free Current Scheme : ఎన్నికల(Elections) కు ముందు ఆరు గ్యారెంటీ(Six Guarantees) లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Government) వాటిని ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తోంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు(Free Bus), ఆరోగ్యశ్రీ(Arogyasri) పరిమితి పెంపును అమల్లోకి తెచ్చింది. మరో వారం రోజుల్లో గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అమలుచేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు ఆయా పథకాలను అమలుపై ఇప్పటికే కసరత్తును ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్‌ అమలు ఆ శాఖ అధికారులకు విద్యుత్‌ గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌(Free Current) ఇస్తే ఏం చేయాలి..? ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలి..? ఎంత విద్యుత్‌ అవసరం..? ప్రస్తుతమున్న విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌ స్టేషన్లు సరిపోతాయా..? ఒక్కసారిగా విద్యుత్‌ వినియోగం పెరిగితే సరఫరా గ్రిడ్‌ తట్టుకోగలదా అన్న విషయాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలుచేస్తోంది. ఉచిత విద్యుత్‌ అమలుచేసినప్పటి నుంచి గతంతో పోలిస్తే ఆ రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ దాదాపు 40 శాతం వరకు పెరిగింది. రానున్నది వేసవి కాలం. సాధారణంగానే విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుంది. దానికి తోడు ఉచిత విద్యుత్‌ను రాష్ట్రంలో అమల్లోకి తీసుకువస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా భారీగా డిమాండ్‌ ఏర్పడితే సరఫరా పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తుతమున్న ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌ స్టేషన్లు, విద్యుత్‌ లైన్లు సరిపోతాయా..? అన్న దానిపై అనుమానాలు నెలకొన్నాయి. ఒక్కసారిగా గ్రిడ్‌పై ఒత్తిడి పెరిగితే తట్టుకోగలదా అన్నది ప్రశ్నార్థకమే. ఉదయం, సాయంత్రం వేళల్లో సరఫరాకు గ్రిడ్ నిర్వహణ ఎలా అన్నదానిపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.

Also Read : కరెంట్ కట్ చేస్తే ఉద్యోగాలు ఫట్.. సీఎం రేవంత్ వార్నింగ్

రాష్ట్రంలో ఒక కోటి 30 లక్షలకు పైగా గృహ కనెక్షన్లు..

రాష్ట్రంలో ప్రస్తుతం ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కం(South Telangana Discom) లు ఉన్నాయి. ఈ రెండు డిస్కంల పరిధిలో దాదాపు ఒక కోటి 30 లక్షలకు పైగా గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్ర విద్యుత్‌ శాఖ లెక్క తేల్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 90 లక్షల రేషనకార్డు దారులు 90 లక్షల మంది. రేషన్‌ కార్డు ఉన్నవారందరికీ ఈ పథకం వర్తింపజేస్తే దాదాపు 90 లక్షల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించాల్సి వస్తుంది. ఇందులో 10 శాతం తగ్గినా దాదాపు 80 లక్షల మందికి ఉచిత విద్యుత్‌ పథకం వర్తింపజేసే అవకాశం ఉంది. రేషన్‌ కార్డు ఉన్న ఇళ్లలో దాదాపు 90 శాతం మంది 100-150 యూనిట్లకు మించి కరెంటు వాడరు. తక్కువలో తక్కువ మంది మాత్రమే 200 యూనిట్లకు పైగా విద్యుత్‌ వాడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ ఇస్తోంది కనుక మిగిలిన వారంతా కూడా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉంది. ఈ 80 లక్షల కనెక్షన్లలో ఇప్పటికే వాడుతున్న దానికి అదనంగా మరిన్ని యూనిట్ల విద్యుత్‌ వాడకం పెరగనుంది.

ఫిబ్రవరిలోనే 15000 మెగావాట్ల డిమాండ్‌..

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థ 18వేల మెగావాట్ల వరకు తట్టుకోగలదని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15000 మెగావాట్ల డిమాండ్‌ ఉంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఇది భారీగా పెరిగే అవకాశం ఉంది. 16000 వేల మెగావాట్లు దాటే అవకాశం ఉంది. అయితే వారం రోజుల్లో అంటే మార్చి నుంచి ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలుచేసేందుకు సర్కారు రెడీ అయింది. ప్రస్తుతం ఒక రోజుకు 28.14 కోట్ల యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. ఇది వచ్చే నెలలో సాధారణంగానే 35 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఉచిత విద్యుత్‌ పథకం అమలైతే దాదాపు 40 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకు ఎక్కువ కూడా అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సరఫరా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యుత్‌ లైన్లు వేసి, సబ్‌ స్టేషన్లు నిర్మించే అవకాశం లేదు. ఒకవేళ చేసినా కూడా దానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉచిత విద్యుత్‌ ఎంత మందికి వర్తింపజేస్తారు..? ఒకవేళ డిమాండ్‌ పెరిగితే ఎలా సరఫరా చేయాలి..? అన్నది విద్యుత్‌ అధికారులకు అంతుబట్టని ప్రశ్నగా మారింది.

Also Read : RGV’s Vyuham: మరోసారి వ్యూహం సినిమా వాయిదా

#free-current #200-units-free-current #congress-six-guarantees #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe