Telangana: గృహజ్యోతి అమలులోకి వచ్చేసింది..
తెలంగాణలో గృహజ్యోతి పథకం అమలులోకి వచ్చేసింది. అర్హులకు విద్యుత్తు సిబ్బంది జీరో బిల్లు ఇస్తున్నారు. ఫస్ట్ జీరో బిల్లు ఇదే అని అధికారులు చూపిస్తున్నారు కూడా.
తెలంగాణలో గృహజ్యోతి పథకం అమలులోకి వచ్చేసింది. అర్హులకు విద్యుత్తు సిబ్బంది జీరో బిల్లు ఇస్తున్నారు. ఫస్ట్ జీరో బిల్లు ఇదే అని అధికారులు చూపిస్తున్నారు కూడా.
ఉచిత విద్యుత్ కి దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు , కరెంట్ కనెక్షన్ నంబర్లు ఇచ్చిన వారే పథకానికి అర్హులని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి జీరో బిల్లులు జారీ చేస్తామని అధికారులు వివరించారు.
తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు తేదీ ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ఈ నెల 27 నుంచి ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రియాంక గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఫ్రీ కరెంట్‌పై ప్రజల్లో గందరగోళం నెలకొంది. హైదరాబాద్‌లో ఉంటున్న చాలామందికి ఊర్లల్లో వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా పథకం అమలు చేస్తే లక్షలాది మంది లబ్ధిదారులకు నష్టం జరుగవచ్చు.
నెలవారీ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి లబ్ధిదారుల గుర్తింపు కోసం తెలంగాణ ఇంధన శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి మీటర్ రీడర్లు ఇంటింటికి వస్తారు. గృహ జ్యోతి పథకంలో చేరాలనుకునే వారు తమ తెల్లరేషన్ కార్డులు, ఆధార్ కార్డులను వారికి చూపించాలి.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో శనివారం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే చత్తీస్ గఢ్ లోనూ అదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు