Pawan Kalyan : జనసేనలోకి మండలి... పోటీ అక్కడ నుంచే! టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్....జనసేన పార్టీలో చేరుతున్నారని సమాచారం . ఇప్పటికే పవన్ తో ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఆయన జనసే కూటమి తరుఫున జనసేన అభ్యర్థిగా మండలి బరిలోకి దిగుతున్నారు. By Bhavana 01 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Elections : ఏపీ(AP) లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల్లో రాజకీయ పరిణామాలు మారుతూన్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి టీడీపీ(TDP) నుంచి ఓ కీలక నేత జనసేన(Janasena) పార్టీలోకి మారుతున్నారు. ఆయన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్(Mandali Buddha Prasad).... ఇప్పటికే పవన్(Pawan) తో ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఆయన బీజేపీ-జనసే-టీడీపీ కూటమి తరుఫున జనసేన అభ్యర్థిగా మండలి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు మండలి 1999, 2004, 2014 సంవత్సరాల్లో సార్వత్రిక ఎన్నికల్లో అవనిగడ్డ నుంచే అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. కూటమిలో భాగంగా అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీ వర్గీయులు మండలికి సపోర్ట్ చేస్తూ రాజీనామాలు కూడా చేశారు. దీంతో అవనిగడ్డ సీటును అధికారులు పెండింగ్ లో పెట్టారు పవన్. దీంతో మండలి జనసేనలోకి వచ్చిన తరువాత మండలిని మంగళవారం కానీ, బుధవారం కానీ ఆయన పేరును ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నాయి. Also Read : భార్యతో కలిసి స్టేజీ మీద డ్యాన్స్ ఇరగదీసిన జక్కన్న! #tdp #elections #janasena #politics #avanigadda #mandali-buddha-prasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి