/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/51.jpg)
Manchu Lakshmi Serious Comments On Voters: తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్‌లో ఓటు వేయడానికి మంచు వారి అమ్మాయి లక్ష్మి ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ ఎఫ్‌ఎన్‌సీసీలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో పాటూ హైదారాబాద్ జనాల మీద విరుచుకుపడ్డారు మంచక్క. హైదరాబాద్ వాసులకు సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు. నేను ముంబయ్ నుంచి ఓటు వేయడానికి వచ్చాను మీరు ఇక్కడక్కడకు రాలేరా అంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 5 శాతమే పోలింగ్ నమోదవ్వడంపై ఆమె గరం గరం అయ్యారు. ఇప్పటికైనా నగర ప్రజలకు ఇళ్ళ/ వదిలి బయటకు వచ్చి ఓటేయాలని హితబోధ చేశారు.