Telangana: మంచిర్యాల మిషనరీ పాఠశాల పై దాడి .. వీడియోలు వైరల్‌!

రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్‌ థెరిసా పాఠశాలలో హనుమాన్‌ మాల ధరించిన విద్యార్థులను తరగతిలోకి అనుమతించలేదని కొన్ని హిందూ సంఘాలు పాఠశాల మీద , పాఠశాల యజామాన్యం పై దాడి చేశాయి. దానికి సంబంధించిన విజువల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Telangana: మంచిర్యాల మిషనరీ పాఠశాల పై దాడి .. వీడియోలు వైరల్‌!
New Update

రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్‌ థెరిసా పాఠశాలలో హనుమాన్‌ మాల ధరించిన విద్యార్థులను తరగతిలోకి అనుమతించలేదని కొన్ని హిందూ సంఘాలు పాఠశాల మీద , పాఠశాల యజామాన్యం పై దాడి చేశాయి. దానికి సంబంధించిన విజువల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి గ్రామంలో మదర్‌ థెరిసా హైస్కూల్‌ ఉంది. దీనిని చాలా సంవత్సరాల నుంచి కేరళకు చెందిన వారు రన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి ప్రిన్సిపాల్‌ గా కేరళకు చెందిన జైమన్‌ జోసెఫ్‌ నే ఉన్నారు. రెండు రోజుల కిందట గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు స్కూల్‌ కి యూనిఫాం బదులు కాషాయ రంగు దుస్తులు ధరించి వచ్చారు.

దానిని చూసిన ప్రిన్సిపాల్‌ జోసెఫ్‌ యూనిఫాం కాకుండా ఈ దుస్తులు ఏంటి అని ప్రశ్నించగా..వారు హనుమాన్‌ దీక్ష చేపట్టినట్లు వివరించారు.దీంతో ప్రిన్సిపల్‌ వారిని తల్లిదండ్రులని పిలుచుకుని రమ్మని చెప్పారు. అయితే ఈ తతంగాన్ని అంతా ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడమే కాకుండా.. మాలధారణ చేసిన వారిని స్కూల్‌ లోపలికి అనుమతించడం లేదని రాసుకొచ్చారు.

దానిని చూసిన కొన్ని హిందూ సంఘాలు ఒక్కసారిగా స్కూల్‌ మీదకు దండెత్తి వచ్చి దాడి చేశాయి. కాషాయ రంగు బట్టలు వేసుకున్న కొందరు యువకులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ పాఠశాల తలుపులను, కిటీకీలను పగలగొట్టడమే కాకుండా.. చేతికి అందిన వస్తువులను కూడా ధ్వంసం చేశారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఉపాధ్యాయునులు వారిని దాడి చేయోద్దని, విధ్వంసం సృష్టించ వద్దని చేతులు జోడించి మరి వేడుకున్నారు. అయినప్పటికీ వారు వినకుండా రెచ్చిపోయారు. ప్రిన్సిపల్‌ జోసెఫ్‌ ను చుట్టిముట్టి ఆయన పై దాడికి దిగారు. ఆయనకు బలవంతంగా బొట్టు పెట్టారు. ఈ ఘటన గురించి వెంటనే పాఠశాల యజమాన్యం క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని పట్టుబట్టి ఆందోళనకు దిగారు.

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోల్లో ఈ దృశ్యాలన్ని కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పాఠశాలలో ఉన్న మదర్‌ థెరిసా విగ్రహాన్ని కూడా వాళ్లు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మతం పేరుతో వివిద వర్గాల మధ్య చిచ్చు పెట్టడం వంటి సెక్షన్ల కింద స్కూల్ ప్రిన్సిపాల్, మరొకరిపై కేసు నమోదు చేశారు.

Also read: నేటి నుంచి టీ శాట్‌ లో డీఎస్సీ ప్రత్యేక తరగతులు!

#telangana #police #adilabad #attack #hanuman-deeksha #manchiryal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి