SpiceJet: తొందరగా వెళ్లొచ్చు..సౌకర్యవంతంగా వెళ్లొచ్చు కాద అని విమానం ఎక్కి అందులో ఉన్న టాయిలెట్ కి వెళ్తే డోర్ లాక్ కావడంతో సుమారు గంటన్నర పాటు అందులో ఇరుక్కుపోయి జర్నీ మొత్తం అందులోనే సాగింది. ఈ ఘటన మంగళవారం నాడు ముంబై నుంచి బెంగళూరు వెళ్లే విమానంలో జరిగింది.
డోర్ తెరుచుకోకపోవడంతో..
బాధితుడు , విమానాశ్రయాధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు స్పైస్ జెట్ విమానం ముంబై నుంచి బెంగళూరుకు బయల్దేరింది. ఈ క్రమంలోనే విమానం టేకాఫ్ అయిన తరువాత ఓ ప్రయాణికుడు టాయిలెట్ కు వెళ్లాడు. అయితే అతను లోనికి వెళ్లిన తరువాత మాల్ ఫంక్షన్ కారణంగా డోర్ తెరుచుకోకపోవడంతో లోపలే ఇరుక్కుపోయాడు.
టాయిలెట్ సీటు పై జాగ్రత్తగా..
విషయం గమనించిన ఫ్లైట్ సిబ్బంది కూడా ప్రయత్నాలు చేశారు. కానీ డోర్ తెరుచుకోలేదు. దీంతో చేసేదేమి లేక ఎయిర్ హోస్టెస్ ఓ కాగితం పై డోర్ తెరుచుకోవడం లేదని..విమానం ల్యాండయ్యాక ఇంజనీర్లు వచ్చి డోర్ తెరుస్తారని తెలిపింది. మరి కాసేపట్లో బెంగళూరులో ల్యాండ్ కాబోతున్నామని..టాయిలెట్ సీటు పై జాగ్రత్తగా కూర్చోవాలని, దెబ్బలు తగలకుండా ఉండాలని తెలిపింది.
విమానం కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే ఇంజనీర్లు వచ్చి డోర్ పగలగొట్టి లోపల ఇరుక్కున్న ప్రయాణికున్ని బయటకు తీశారు. గంటన్నరకు పైగా టాయిలెట్ లోనే ఉండిపోవడంతో ప్రయాణికుడు తీవ్ర ఆందోళనకు గురైనట్లు అధికారులు వివరించారు. దీంతో అతనికి చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వివరించారు.
Also read: హైదరాబాద్ లో మొదలైన విద్యుత్ కోతలు..నేటి నుంచి ఎప్పటి వరకు