/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/man-sewing-a-dress-with-a-sack-has-gone-A-video-viral-on-social-media--jpg.webp)
Viral Video: చాలా మంది స్టైలీష్‌గా కనిపించేందుకు రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. మరికొందరు అందరిలోనూ డిఫరెంట్‌గా కనిపించాలని సొంతగా బట్టలను డిజైన్ చేయించుకుంటారు. గోనె సంచితో డ్రస్సు కుట్టించుకున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి గోనె సంచులతో కుర్తా షూట్‌ని కుట్టించుకుని వేసుకున్నాడు.
View this post on Instagram
ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇతని తెలివితేటలకు అందరూ ఫిదా అవుతున్నారు. చూసేందుకు భారతీయ సాంప్రదాయ దుస్తుల్లా కనిపిస్తున్నా దగ్గరికి వెళ్లే సరికి అసలు నిజం తెలుస్తోంది. అతను బ్యాగీ ట్రెండ్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నాడంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరొకరు అయితే వేసుకున్న అతనికి ఎలా ఉందో తెలియదు కానీ చూసేందుకు మాత్రం నాకు ఊపిరి ఆడటం లేదంటూ కామెంట్ చేశాడు.
ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బాసూ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కుట్టిన టైలర్‌కు ఓ దండం పెట్టాలని అంటున్నారు. ఇలాంటి డ్రెస్సు కుట్టాలంటే ఎంత పెద్ద మిషన్ వాడారు. అది ఏం కంపెనీ అంటూ వింతగా కామెంట్లు చేస్తున్నారు. గతంలో కొన్ని వైవిధ్యమైన ఫ్యాషన్ షోలలో పేపర్ డ్రెస్సులు, కవర్ డ్రెస్సులు, ఇంకా రకరకాల డ్రెస్సులను చూశాం కానీ ఇలాంటి గోనె సంచుల డ్రస్ అది కూడా పర్ఫెక్ట్ ఫిటింగ్‌తో చూడలేదు బాబూ అంటూ ఆ యువకుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇది కూడా చదవండి: వెంకటేశ్వరస్వామి అనుగ్రహం కోసం బియ్యంతో ఇలా చేయండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.