/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-20T103145.866-jpg.webp)
Donald Trump : న్యూయార్క్ కోర్టు(New York Court) లో డోనాల్డ్ ట్రంప్(Donald Trump) హష్‌మనీ విచారణ జరుగుతోంది. మొత్తం 12 మంది న్యాయమూర్తుల సమక్షంలో డోనాల్డ్ ట్రంప్ ఈ కేసులో దోషా కాదా అని విచారిస్తున్నారు. 2006లో డొనాల్డ్ ట్రంప్.. తాన ఓ కార్యక్రమంలో కలుసుకున్నామనీ.. ఆ తర్వాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నామని పోర్న్ స్టార్ డేనియల్స్(Denials) ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచేందుకు ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్(Michael Cohen) 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారన్నది ఆరోపణ. అయితే, ఇది నిజమేనని కోహెన్ ఒప్పుకోవడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఐదేళ్లుగా డొనాల్డ్ ట్రంప్ పై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 76 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. కాగా, ఇప్పటివరకు ఏ కేసులోనూ నేరం రుజువు కాలేదని, తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు.
అయితే ఈ కేసు విచారణ ఈ రోజు కూడా మళ్ళీ కొనసాగింది. ఇదే సమయంలో న్యూయార్క్ కోర్టు బయట అనుకోని సంఘనట ఒకటి జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి కోర్టు బయట తనకు తాను నిప్పటించుకుని కాల్చుకుని చనిపోయాడు. ముందుగా కరపత్రాలను గాలిలోకి విసిరేసి... ఆతరువాత నిప్పంటించుకోవడం చూశామని ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. మూడు నిమిషాలకు పైగా అతను మంటల్లో చిక్కుకుని ఉండిపోవడం చేశామని తెలిపారు. దాంతో అతను పూర్తిగా కాలిపోయాడని చెప్పారు. ఇది జరిగిన కొద్దిసేపటికి ప్లాజా అంతా పొగ వ్యాపించింది. దీంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అతను పూర్తిగా కాలిపోయాడు.
మరోవైపు న్యూయార్క్ కోర్టు వెలుపల నిప్పంటించుకున్న వ్యక్తి ఎవరు అన్నది ఇంకా తెలియలేదు. అతను ఎందుకు ఈ పని చేశాడు అన్నది కూడా కనుక్కోవలసి ఉంది. అతను విసిరిన కరప్రతాల ఆధారంగా సంఘటన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దాంతో పాటూ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా చనిపోయిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు.