Un-Expected Online Orders : ఇప్పుడున్న స్పీడ్ యుగంలో పుడ్, మనకు కావల్సిన సరుకులు, మందులు ఇలా ఏది కావాలంటే అది యాప్‌ల ద్వారా తెప్పించేసుకోవచ్చును. ఇంతకు ముందు నుంచే ఇవి అందుబాటులో ఉన్నాయి. కానీ కరోనా పుణ్యమాని అప్పటి నుంచీ వీటికి ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. ఇల్లు కదలకుండా తమకు కావాల్సినవి కాళ్ళ దగ్గరకు తెప్పించుకుంటున్నారు. అయితే ఫోన్లు, యాప్‌లు ఒక్కోసారి సరిగ్గా పని చేయవు. అలాంటప్పుడు మాత్రం వీటితో వచ్చే కష్టాలు బాగా తెలుస్తాయి. ఢిల్లీలోని గురుగ్రామ్‌కు చెందిన ప్రణయ్ లోయా ఇలాంటి బాధితుడే. ఇతను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ లో కొన్ని సరుకులు ఆర్డర్ పెట్టాడు. డబ్బులు కట్ అయ్యాయి కానీ ఆర్డర్ కాన్సిల్ అని చూపెట్టింది. దాంతో మరోసారి ప్రయత్నించాడు. అప్పుడుకూడా అలానే అయింది. కొన్ని వస్తువులు తగ్గించి మళ్ళీ ప్రయత్నం చేశాడు. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఇంక మొత్తానికే ఆర్డర్ పెట్టడం మానేశాడు.
Also read:ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు..నేతలకు టార్గెట్లు ఫిక్స్
కాసేపటి తర్వాత ప్రణయ్ స్విగ్గీ(Swiggy) ని వదిలేసి జెప్టోలో వస్తువులను ఆర్డర్ పెట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ కట్ చేస్తే కాసేపటికి ప్రణయ్ కు ఒకదాని తర్వాత ఒకటి కాల్స్ వచ్చాయి. ఏంటా అని చూస్తే మేము మీ డోర్ దగ్గర ఉన్నాం తలుపు తీయండి అంటూ. ఎవరా అని చూసిన ప్రణయ్ కు షాక్ ఇచ్చారు స్విగ్గీ డెలివరీ బాయ్స్. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఒకే ఐటెమ్స్ పట్టుకుని వచ్చి డెలివరీ చేశారు. అతనికి 20లీటర్ల పాలు, 6కేజీల దోశపిండి, 6 ప్యాకెట్ల పైనాపిల్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు ఎంచక్కా.
సాంకేతిక లోపం కారణంగా ప్రనయ్ కు ఎదురైన సంఘటన ఇది. స్విగ్గీ వాళ్ళకు చెప్పినా మేము రిటర్న్ తీసుకోము అనడంతో ఇప్పుడు ఈ వస్తువులు అన్నీ ఏం చేసుకోవాలి అంటూ తలపట్టుకుని కూర్చున్నాడు ప్రణయ్. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈతని పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది.