Khammam : ఆస్తి కోసం.. తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య! ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు. By Bhavana 18 May 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Mother & Daughters Murder : ఖమ్మం(Khammam) జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆస్తి(Asset) కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య(Murder) చేశాడు. తన పేరుపై ఉన్న ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్న వెంకటేశ్వర్లు.. తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. అనంతరం ఇద్దరు కుమార్తెలు నీరజ(10), ఝాన్సీ(6)లను చంపి పారిపోయాడు. పొలం తన పేరుపై రాయాలంటూ తల్లిని వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా వేధిస్తున్నట్లు సమాచారం. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, రెండేళ్ల క్రితం భార్యను కూడా హత్య చేశాడని స్థానికులు తెలిపారు. Also read: బిల్లు పేపర్లతో పారిపోయిన ఎంపీ..ఎక్కడంటే! #telangana #khammam #murder #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి