ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు.. 28 ఏళ్లకు ఆ జాబ్ వచ్చింది..

ఉత్తరప్రదేశ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తికి 28 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగం వచ్చింది. అంకుర్ గుప్తా అనే వ్యక్తి 1995లో తపాలాశాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అతను మెరిట్ జాబితాలో చోటు సంపాదించుకుని ముందస్తు శిక్షణకు కూడా ఎంపికయ్యాడు. కానీ అతని విద్యార్హతల కారణంగా ఉద్యోగానికి అనర్హుడంటూ తపాలాశాఖ అంకుర్‌ను ఎంపికైన అభ్యర్థుల జాబితా నుంచి తొలగించింది. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు రావడంతో దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం అతనికి నెలరోజుల్లో ఉద్యోగాన్ని ఇవ్వాలని తపాలాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.

New Update
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు.. 28 ఏళ్లకు ఆ జాబ్ వచ్చింది..

సాధారణంగా ఏదైన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే కొన్ని రోజులు, వారాలు లేదా కొన్ని నెలలకైనా దానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకోవచ్చు. కానీ ఓ వ్యక్తి ఉద్యోగానికి అప్లై చేసిన 28 ఏళ్లకు ఉద్యోగాన్ని పొందాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే దీని గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదావాల్సిందే.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంకుర్ గుప్తా అనే వ్యక్తి 1995లో తపాలాశాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అంతేకాదు అందులో మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే ముందస్తు శిక్షణకు కూడా ఎంపికయ్యారు. అయితే ఇక్కడే మరో ట్విస్టు జరిగింది. అతను వృత్తి విద్యా కోర్సులో ఇంటర్మీడియట్ చదివినందు వల్ల ఉద్యోగానికి అనర్హుడంటూ తపాలా శాఖ అధికారులు భావించారు. దీంతో ఎంపికైన అభ్యర్థుల జాబితా నుంచి అంకుర్ గుప్తా పేరును తొలగించారు. దీంతో అతడు షాకయ్యాడు.

Also Read: ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలుసు-అశోక్ గహ్లోట్‌

దీంతో అతను కేంద్రపరిపాలనా ట్రైబ్యుల్‌ను ఆశ్రయించాడు. 1999లో ట్రైబ్యునల్ అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ తపాలాశాఖ 2000 సంవత్సరంలో అలహబాద్ హైకోర్టును ఆశ్రయించింది. 2017లో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తపాలాశాఖ పిటిషన్‌ను కొట్టివేసి కేంద్రపరిపాలనా ట్రైబ్యుల్‌ తీర్పును సమర్థించింది. ఆ తర్వాత తపాలాశాఖ హైకోర్టులో ఓ రివ్యూ కూడా దాఖలు చేసింది. 2021లో దాన్ని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. ఇక చివరికి తపాలాశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అయితే ఎట్టకేలకు జస్టిస్ బేలా ఎం.త్రివేది,జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేసింది. అంకుర్ గుప్తా ఉద్యోగానికి ఎంపికై ముందస్తు శిక్షణకు సంబంధించిన ఉత్తర్వులు అందుకున్నా కూడా అతను ఉద్యోగానికి అనర్హుడంటు నియామకాన్ని రద్దు చేయడాన్ని తప్పుబట్టింది. అంకుర్ గుప్తాకు నెలరోజుల్లోగా ఉద్యోగం ఇవ్వాలని తపాలాశాఖకు ఆదేశించింది. ఒకవేళ పోస్టు ఖాళీ లేకున్నా కూడా అదనంగా సృష్టించి ఇవ్వాల్సిందేనని చెప్పింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో అంకుర్ గుప్తాకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న 28 ఏళ్లఅనంతరం ఉద్యోగం వచ్చినట్లైంది.

Advertisment
తాజా కథనాలు