Watch Video: డ్యామ్‌పై ప్రమాదకర స్టంట్.. యువకుడు మృతి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మకర్‌ఢోక్డా డ్యామ్ వద్ద ఆకాశ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్రమాదకర స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. నీళ్లు పారుతున్న గోడపైకి ఎక్కగా.. బ్యాలెన్స్ తప్పడంతో డ్యామ్‌లో పడిపోయాడు. చివరికి కొన్ని గంటల తర్వాత డ్యామ్‌లో ఆకాశ్ మృతదేహం లభ్యమైంది. By B Aravind 18 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు. ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే జరిగాయి. రీల్స్ కోసం రోడ్లపై, రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్న పలువురు యువతీ, యువకులు వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. అయితే తాజాగా మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని మకర్‌ఢోక్టా డ్యామ్ వద్ద ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేస్తూ మృతి చెందాడు. Also Read: రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మారుస్తాం: కేటీఆర్ ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆకాష్ అనే యవకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి మకర్‌ఢోక్డా డ్యామ్‌కు వెళ్లాడు. నీళ్లు పారుతున్న రిజర్వాయర్ గోడపైకి ఎక్కాడు. అతడితో పాటు తన ఇద్దరు స్నేహితులు కూడా పైకి ఎక్కి స్టంట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ గోడపై నుంచి ఆకాష్ బ్యాలెన్స్ తప్పి డ్యామ్‌లో పడిపోయి గల్లంతయ్యాడు. అతడి కోసం రెస్క్యూ టీం గాలించినా కూడా ఫలితం దక్కలేదు. చివరికి కొన్ని గంటల తర్వాత డ్యామ్‌లో ఆకాశ్ మృతదేహం లభ్యమైంది. వాళ్లు స్టంట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Also Read: లెజండరీ సింగర్ సుశీలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు #stunt #maharastra #national-news #dam #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి