Man Commits To Die : ఏపీ (Andhra Pradesh) లో ఓ యువకుడు తనను ప్రేమించలేదంటూ.. తన ప్రియురాలని హత్య (Kill) చేసేందుకు యత్నం చేశాడు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఆ యువతి ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ విషయం కాస్తా పోలీసుల వరకు చేరడంతో.. నిందితుడు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
కడప జిల్లా (Kadapa District) బద్వేలులో సాయికుమార్ రెడ్డి(27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పుంటించుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు విడిచాడు. అయితే, ఆ యువకుడి ఆత్మహత్యకు లవ్ ఫెయిల్యూరే (Love Failure) కారణమని పోలీసులు నిర్థారించారు. ఆత్మహత్యకు ముందు అట్లూరు మండలం తంబళ్లగొంది సచివాలయంలో ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించబోయాడు సాయికుమార్ రెడ్డి.. కానీ, లైటర్ వెలగకపోవడంతో ఆ యువతి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది.
ఈ విషయమై అట్లూరు సచివాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక, సాయి కుమార్ రెడ్డి ఫోన్ పనిచేయకపోవడంతో తన అన్నకు ఫోన్ చేసిన అట్లూరు పోలీసులు ఘటన సమాచారం తెలియజేశారు. మరోవైపు.. అప్పటికే బద్వేలులోని తన అక్క ఇంట్లో నిప్పంటిచుకున్న సాయికుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
Also read: నా రూటే సపరేటు..జీ 7 లో అమెరికా అధ్యక్షుని వింత ప్రవర్తన!