Mamata Banerjee : ఇండియా కూటమికి మద్ధతిస్తాం.. దీదీ సంచలన ప్రకటన

ఇండియా కూటమి గెలిస్తే తాము బయటినుంచి మద్దతిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేశారు. ఎన్నికలకు ముందు సీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఇండియా కూటమికి దూరంగా ఉన్న దీదీ.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

New Update
Mamata Banerjee : ఇండియా కూటమికి మద్ధతిస్తాం.. దీదీ సంచలన ప్రకటన

Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికలకు ముందు తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC) .. ఇండియా కూటమికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) వెనక్కి తగ్గారు. ఇండియా కూటమి(Alliance Of India) గెలిస్తే తాము బయటినుంచి మద్దతిస్తామని ప్రకటన చేశారు. ఇటీవల ఎన్నికలకు ముందు సీట్ల పంపకాలపై టీఎంసీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియా కూటమికి మమత దూరంగా ఉన్నారు.

Also Read: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

బుధవారం కోల్‌కతా(Kolkata) లోని మీడియాతో మాట్లాడిన దీదీ.. ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తామని చెప్పారు. అయితే ఇటీవలే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ(BJP) కి మద్దతిచ్చి టీఎంసీని ఓడించాలని చూస్తున్నాయని మమతా బెనర్జీ విమర్శించారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ ఇండియా కూటమికి మద్దతిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: మీటింగ్‌ నుంచి తిరిగి వస్తుండగా ప్రధాని పై కాల్పులు..ఆస్పత్రికి తరలింపు!

Advertisment
తాజా కథనాలు