Mamata Benarjee: రోడ్డు ప్రమాదానికి గురైన దీదీ.. తలకు గాయం

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కారు ప్రమాదానికి గురయ్యారు. బర్ధమాన్‌ నుంచి కోల్‌కతా వైపు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఆమె తలకు గాయాలైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నాయి.

New Update
Mamata Benarjee: రోడ్డు ప్రమాదానికి గురైన దీదీ.. తలకు గాయం

పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి (Accident) గురైంది. బర్ధమాన్‌ నుంచి కోల్‌కతా వైపు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రమాదంలో ఆమె తలకు స్వల్ప గాయమైనట్లు పేర్కొన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈరోజు ప్రతికూల వాతావరణం కారణంగా.. దీదీ హెలికాప్టర్‌లో కాకుండా కారులో రోడ్డుపై వెళ్లారు. అయితే పొగమంచు ఎక్కువగా ఉండటంతో రహదారిపై వాహనాలు సరిగా కనిపించని పరిస్థితి నెలకొంది.

Also Read: పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్!

తలకు స్వల్ప గాయాలు

ఈ క్రమంలోనే ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ మరో వాహనాన్ని తప్పించేందుకు యత్నిస్తూ.. ఒక్కసారిగా కారుకు బ్రేకులు వేశాడు. దీంతో మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా.. దీదీ తాజాగా ఇండియా కూటమికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో తాము ఒంటరిగానే పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ సీట్ల పంపకంపై జరిపిన చర్చలు విఫలమయ్యాయని.. మేము వారికి ఏ ప్రాతిపాదన ఇచ్చినా కూడా వాటన్నింటిని తిరస్కరించారని దీదీ అసంతృప్తి వ్యక్తం చేసారు.

దీదీ లేకుండా ఎలా

అయితే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ 10 నుంచి 12 సీట్లు కావాలని పట్టుబడుతోందని అన్నారు. అయితే.. దీదీ మాత్రం కేవలం రెండు సీట్లనే కాంగ్రెస్‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌, టీఎంసీల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్న తరుణంలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆమె ప్రకటించడం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం మమతాబెనర్జీ లేకుండా ఇండియా కూటమిని ఊహించలేమంటూ వ్యాఖ్యానించింది. ఆమె తీసుకున్న నిర్ణయంతో బీజేపీని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Also Read: రామాలయం వల్ల యూపీకి ఏటా రూ.4 లక్షల కోట్ల ఆదాయం..

Advertisment
Advertisment
తాజా కథనాలు