Anand Mahindra: ఆ కంపెనీలో పెట్టుబడి పెడుతాను: ఆనంద్ మహీంద్రా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తాజాగా ఓ అటనామస్ రోబో నీటిలో చెత్తను శుభ్రం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇలాంటి పరికరాలు మన దేశంలో ఇప్పుడు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైన స్టార్టప్ ఇలాంటివి తయారుచేస్తే అందులో పెట్టుబడి పెడతా అని అన్నారు. By B Aravind 02 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రముఖ వ్యాపారవేత్త, టెక్ మహింద్రా వ్యవస్థాపకుడు ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుకుగా ఉండే ఈయన తన అభిమానులతో నిత్యం కొత్త కొత్త విషయాలను పంచుకుంటారు. ఏదైన కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడు ముందుంటారు ఆనంద్ మహీంద్రా. అయితే తాజాగా ఈయన మరో కొత్త వీడియోను ఎక్స్( ట్విట్టర్)లో పోస్టు చేశారు. Also read: 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ : సీఎం రేవంత్ అందులో పెట్టుబడి పెడుతా ఇక ఆ వీడియోను చూస్తే.. ఒక రోబో మురికి నదిని వేగంగా శుభ్రం చేస్తోంది. ఆ నదిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని లోపలికి లాగేసుకుంటోంది. దీనిపై మహింద్రా స్పందిస్తూ.. 'నదులను శుభ్రపరిచే అటనామస్ రోబో ఇది. చూడటానికి చైనాలో తయారైనట్లు కనిపిస్తోంది కదా ? ఇలాంటి రోబోను మనం కూడా ఇక్కడ.. ఇప్పుడే తయారుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైన స్టార్టప్ కంపెనీ దీన్ని రూపొందిస్తే.. అందులో నేను పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అంటూ' పేర్కొన్నారు. ఇలాంటి స్టార్టప్ ఉంది అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇలాంటి పరికరాలు చాలా అవసరమని.. నీటితో సహా పర్వత ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను ఏరేసేందుకు ఇవి ఉపయోగపడుతాయని నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీటిని క్లీన్ చేసే రోబోల తయారీపై ఇప్పటికే మన దేశంలో క్లియర్ బాట్ అనే స్టార్డప్ పనిచేస్తోందని మరో నెటిజన్ తెలిపారు. Also Read: వచ్చేది మనమే.. కాంగ్రెస్, బీజేపీలపై హరీష్ రావు చురకలు Autonomous robot for cleaning rivers. Looks like it’s Chinese? We need to make these….right here…right now.. If any startups are doing this…I’m ready to invest… pic.twitter.com/DDB1hkL6G1 — anand mahindra (@anandmahindra) February 2, 2024 #anand-mahindra #anand-mahindra-tweet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి