Maldives : భారతీయులా మజాకానా.. దెబ్బకి దిగి వచ్చిన మాల్దీవులు!

మాల్దీవుల ఆర్థికరంగం ఒక్కసారిగా కుంటుపడడంతో పొగరు దిగింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న భారత రాయబార కార్యాలయంతో మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ సమావేశమై ముఖ్యమైన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని కోరింది.

New Update
Maldives : భారతీయులా మజాకానా.. దెబ్బకి దిగి వచ్చిన మాల్దీవులు!

Indians : క్షవరం అయితే కానీ వివరం రాదని పెద్దలు ఊరికే అనలేదు... ఈ మాట మాల్దీవులకు(Maldives) పర్ఫెక్ట్‌ గా సెట్‌ అవుతుంది. చైనా అండగా ఉందని భారత్‌(India) తో కయ్యానికి కాలు దువ్వింది. దువ్విన చోటే మొత్తం బోడి గుండు అయ్యింది. మాల్దీవులకు మొదటి ఆదాయ, ఆర్థిక వనరు అయినటువంటి పర్యాటక రంగం ఒక్కసారిగా కుదేలైపోయింది.

ఆర్థికరంగం ఒక్కసారిగా కుంటుపడడంతో పొగరు దిగింది. దీంతో కాళ్లబేరానికి దిగింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న భారత రాయబార కార్యాలయంతో మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ సమావేశమై... ముఖ్యమైన నగరాల్లో రోడ్ షో(Road Show) లు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇప్పించాలంటూ బతిమాలడుకోవడం మొదలు పెట్టింది.

భారతీయ పర్యాటకులను తమ దేశానికి రప్పించేందుకు ప్రచారం నిర్వహిస్తామని కోరారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు భారత హైకమిషనర్‌‌కు విజ్ఙప్తి చేశారు. మాల్దీవులకు భారత్‌ చాలా కీలకమైన ఆర్థికవనరుగా ఉంది. ఈ క్రమంలోనే తమ దేశాన్ని ఒక ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్‌లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్‌(Travel Association) లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని ట్రావెట్స్‌ సంస్థ పేర్కొంది.

ఇండియాలో కీలకమైన ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. ఇరుదేశాల మధ్య పర్యటక సంబంధాలను పెంపొందించడంలో భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తామని ట్రావెట్స్‌ సంస్థ పేర్కొంది.

ఇటీవల ప్రధాని మోడీ(PM Modi) కేంద్రపాలిత ప్రాంతమైన లక్ష్యదీప్‌ను సందర్శించి.. భారతీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యాటకరంగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దీంతో మాల్దీవులు.. మోడీపై అక్కసు వెళ్లగక్కారు. అవమానకరమైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో భారతీయులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనలను రద్దు చేస్తున్నారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు కూడా కుంటుపడ్డాయి.

Also read: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. పదవీ విరమణ పై సర్కార్ కీలక నిర్ణయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు