India - Maldives : ఆ రోజున భారత బలగాలు మాల్దీవులను వదిలి వెళ్తాయి: మయిజ్జూ

మే 10వ తేదీ నాటికి భారత దళాలు ఇక్కడి నుంచి వెళ్లిపోతాయని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మయిజ్జూ ఆ దేశ పార్లమెంట్‌ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మార్చి 10 నాటికి బలగాలు బయలుదేరుతాయని.. మిగిలిన సైనికులు మే 10 నాటికి పూర్తిగా వెళ్లిపోతారని పేర్కొన్నారు.

India - Maldives : ఆ రోజున భారత బలగాలు మాల్దీవులను వదిలి వెళ్తాయి: మయిజ్జూ
New Update

Mohamed Muizzu : భారత్ - మాల్దీవుల(India - Maldives) మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయుజ్జూ గతంలో ఓసారి భారత సైన్యం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రకటించన చేయడం తీవ్ర దుమారం రేపింది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత బలగాల ఉనికి గురించే ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై స్పందించారు.

మే 10 నాటికి వెళ్లిపోతాయి

ఈరోజు ( సోమవారం) రాష్ట్రపతి హోదాలో మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు(Mohamed Muizzu) ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాల్దీవుల్లో ఉన్న భారత దళాలు మే 10 నాటికి వెళ్లనున్నారు అని చెప్పారు. మార్చి 10 నాటికి బలగాలు బయలుదేరుతాయని.. మిగిలిన సైనికులు మే 10 నాటికి పూర్తిగా ఈ దేశం వదిలి వెళ్లిపోతారని పేర్కొన్నారు. మాల్దీవుల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకునేందుకు ఏ దేశాన్ని కూడా అనుమతించమని చెప్పారు.

విమాన సర్వీసులకు ఓకే

ఇటీవల న్యూఢిల్లీ(New Delhi) లో భారత్ - మాల్దీవుల మధ్య జరిగిన సమావేశంలో బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు అంగీకారనికి వచ్చినట్లు తెలుస్తోంది. మాల్దీవులకు మానవతా సేవలు అందించేందుకు భారతీయ విమాన సర్వీసులు ప్రారంభించడానికి ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. అలాగే భారత సైనికుల స్థావరంలో పౌరులు కూడా ఉంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదించినట్లు సమాచారం.

మయిజ్జూ క్షమాపణలు చెప్పాలి

ఇదిలా ఉండగా.. మయిజ్జూ భారత వ్యతిరేక వైఖరి విమర్శలకు దారితీయగా.. ఆయన ప్రభుత్వం చైనా(China) కు అనుకూలంగా పనిచేస్తోందని.. అక్కడి విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల భారత్‌ - మాల్దీవుల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోపణలు చేశారు. అలాగే మయుజ్జూ భారత్‌కు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశాయి.

Also Read : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో సీఐ దుర్గారావు అరెస్ట్

#telugu-news #mohamed-muizzu #maldives-dispute #india-maldives
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe