India-Maldives Conflict: మార్చి15 లోపు భారత సైన్యం వెళ్లిపోవాలి: మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు
భారత్ - మాల్దీవుల మధ్య ఇటీవల జరిగిన పరిణామాలపై ఇరు దేశాల అధికారులు మాలేలో సమావేశమై చర్చించారు. అయితే మార్చి 15వ తేదీ నాటికి భారత సైన్యాన్ని వెనక్కి పంపించే ప్రక్రియను పూర్తి చేయాలని తమ దేశ అధ్యక్షుడు చెప్పాడని మాల్దీవుల అధికారులు భారత హై కమీషనర్‌కు తెలియజేశారు.