Maldives Ministers suspended:మోడీ ఎఫెక్ట్..ఆ ముగ్గురు మంత్రులూ సస్పెండ్

ప్రధానమంత్రి మోడీపై అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం అంతటా దుమారం లేపుతున్నాయి. భారతదేశంలో దాదాపు అందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. బాయ్‌కాట్ మాల్దీవులు హ్యాట్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. మరోవైపు అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది ఆ దేశ ప్రభుత్వం.

Maldives Ministers suspended:మోడీ ఎఫెక్ట్..ఆ ముగ్గురు మంత్రులూ సస్పెండ్
New Update

Suspend ministers:అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించవాల్సిందే. అది ఏ దేశంలో అయినా కూడా. ఇప్పుడు అదే జరిగింది. భారతదేశ ప్రదాని మోడీ మీద అనుచిత వ్యాఖ్యలుచేసిన మాల్దీవుల మంత్రులు ముగ్గురు మీద ఆ దేశం వేటు వేసింది. భారత్‌ను అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లకు సంబంధించి ఆ దేశ గవర్నమెంటు ఈ శిక్షలను అమలుచేసింది. ప్రభుత్వ పదవుల్లో ఉంటూ ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం తప్పు అంటూ యమంత్రులకు చివాట్లు పెట్టింది. మంత్రులు మర్యమ్ షియునా, మల్షా షరీఫ్, మహ్జూమ్ మజిద్‌లను సస్పెండ్ చేశారు.

Also read:ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ..మరో రెండు గ్యారంటీల అమలుపై ఫోకస్

ఏం జరిగందంటే...
భారత ప్రధాని మోడీ రీసెంట్‌గా లక్షద్వీప్‌లో పర్యటించారు. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆయన వీడియో, ఫొటోలు షేర్‌ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. వీటినచూసి చాలా మంది నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలు బొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇలాంటి మాటలతోనే పోస్ట్‌లు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్‌ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్‌ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్‌ రమీజ్‌ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్‌ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. వారి పోస్ట్‌లను ఎక్స్ నుంచి తొలగించారు కూడా. వారి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలే తప్ప, విద్వేషాన్ని, ప్రతికూల ప్రభావాన్ని కలిగించేలా ఉండొద్దు. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సంబంధాలను దెబ్బతీయొద్దు అని పేర్కొంది.

మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ నేతలు మరికొందరు కూడా స్పందించారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలు తప్పని చెప్పారు. భారతీయులకు కోపం రావడంలో ఎటువంటి తప్పూ లేదని వ్యాఖ్యానించారు. భారత్‌ మనకు కీలక మిత్రదేశం. మాల్దీవుల భద్రత, అభివృద్ధిలో చాలా కీలకం. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాష వాడటం తగదు అంటూ కొత్త అధ్యక్షుడు ముయిజ్జు అన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా ఈ వ్యాఖ్యలను సిగ్గుచేటు, జాత్యహంకారం అని అభివర్ణించారు. ఇక సిట్టింగ్ ఎంపీ ఎంఎస్ అబ్దుల్లా అయితే తాను భారతదేశానికి క్షమాపనలు చెప్పాలనుకుంటున్నాని అన్నారు.

విమానాల బుకింగ్ రద్దు..

ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ ట్రావెటింగ్ కంపెనీలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ లోని అతిపెద్ద ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్ (EaseMyTrip) మాల్దీవులకు తన అన్ని విమాన బుకింగ్‌లను క్యాన్సిల్ చేసింది. ప్రధానికి సంఘీభావంగా ఈజీ మై ట్రిప్ (EaseMyTrip) మాల్దీవులకు అన్ని విమాన బుకింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించిందని సీఈవో నిశాంత్ పిట్టి చెప్పారు.

#pm-modi #ministers #maldives #lakshdweep #x-posts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe