Prithviraj : ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న సలార్(Salaar) సినిమా రేపు థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిపోయి...బుక్ మై షో క్రాష్ కూడా అయిపోయింది. మొదటి రోజే వంద నుంచి 150 కోట్ల వరకు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో ప్రీ బుకింగ్స్‌తోనే మిలియన్ల క్లబ్బులోకి జాయిన్ అయిపోయింది సలార్. ప్రస్తుతం దేశమంతా సలార్ ఫీవర్ కనిపిస్తోంది.
Also read:అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం
సలార్ రేపు విడుదల అవుతోంది. అయితే అన్ని సినిమాలకు చేసినట్టు దీనికి మాత్రం టీమ్ పెద్దగా ఏమీ ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ప్రశాంత్ నీల్, ప్రభాస్(Prabhas) కాంబినేషన్ మీదనే అంచనాలు అన్నీ బిల్డప్ అయ్యాయి. దీనికి తోడు టీజర్, ట్రైలర్ లు సినిమా మీద మరింత అంచనాలు పెంచేసాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్ ఈవెంట్లు, మీడియాతో ఇంటరాక్షన్స్ వంటివి ఏమీ చేయలేదు కానీ రాజమౌళితో సలార్ టీం ఓ ఇంటర్వ్యూ మాత్రం చేసింది. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్‌లతో రాజమౌళి చేసిన ఈ ఇంటర్వ్యూ ఇది.
ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ ముందు 45 రోజులే షూటింగ్ అని హోంబలే ఆఫర్ ఇచ్చిందని.. అంతేకదా అని ఒప్పేసుకుందాం అనుకున్నానని చెప్పాడు. ఒక్కో సినిమాకు 5, 3 ఏళ్లు పని చేస్తున్నా కదా.. ప్రశాంత్ నీల్‌తో సినిమాను చేయను అని నో చెబితే ఫ్యాన్స్ చంపేస్తారని అనుకున్నానని అంటున్నాడు డార్లింగ్. అందుకే ఎలాగైనా సరే నాగ్ అశ్విన్‌ను ఒప్పించి.. డేట్లు అడ్జస్ట్ చేసి సలార్‌కు ఓకే చెప్పానని ప్రభాస్ అన్నాడు.
ఇక ఇందులో మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన పృథ్వీరాజ్ మాట్లాడుతూ ప్రభాస్ తో పొరపాటున కూడా ఏ మాటా అనకూడదని అంటున్నాడు. మామూలుగా అన్న విషయాలను కూడా సీరియస్ తీసుకుంటాడని చెప్పుకొచ్చాడు. తన కూతురితో మాట్లాడుతూ తనకి ఏ ఫుడ్ ఐటెమ్స్ ఇష్టమో అడిగాడు. నాకూతురు ఏవో లిస్ట్ చెప్పింది. అంతే ప్రబాస్ అవన్నీ పంపించేవాడు. వాటిని పెట్టుకోవడానికి మరొక రూమ్ తీసుకోవాల్సి వచ్చిందని అని చెప్పకొచ్చాడు పృథ్వీ. దీని కంటే హైలెట్ స్త్రంటి అంటే ఒకసారి ప్రభాస్ తో నాకు కార్లు అంటే ఇష్టం అని చెప్పా...అంతే తన లంబోర్గిని కార్ తీసుకొచ్చి ఇచ్చేశాడు. షూటటింగ్ జరిగిననన్నాళ్ళు వాడుకోమని ఇచ్చేశాడు. ఇలా ప్రభాస్ ప్రేమతో చంపేస్తాడని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలో తమ ఇద్దరి మధ్యా స్నేహం అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపాడు.