Salaar 2 : 'సలార్ 2' ని పక్కన పెట్టారా? ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

Salaar 2 : 'సలార్ 2' ని పక్కన పెట్టారా? ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
New Update

Makers Gives Clarity On Salaar 2 :  పాన్ ఇండియా (PAN INDIA) హీరో ప్రభాస్ (Prabhas) – కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వచ్చిన ‘సలార్’ పార్ట్-1 గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభాస్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. సినిమాలోని యాక్షన్ సీన్స్ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘సలార్’ పార్ట్-1 హిట్ అవ్వడంతో అప్పుడే పార్ట్-2 పై అంచనాలు పెరిగిపోయాయి.

ఇదిలా ఉంటే గత వారం రోజుల నుంచి సాలార్ 2 ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని సొషల్ మీడియా (Social Media) అంతటా జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు రావడంతో సలార్ 2 ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని పలు వెబ్ సైట్స్ వార్తలు ప్రచారం చేసాయి. తాజాగా ఈ వార్తలపై సలార్ 2 (Salaar 2) నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. ఈమేరకు సలార్ 2 పై వస్తున్న రూమర్స్ కి ఒక్క ఫోటోతోనే క్లారిటీ ఇచ్చారు.

Also Read : పోలీస్ ఆఫీసర్ గా కాజల్.. ‘సత్యభామ’ ట్రైలర్ అదిరింది..!

ఒక్క ఫోటోతో క్లారిటీ వచ్చేసిందిగా

'సలార్ 2' ఆగిపోయిందనే ప్రచారంపై స్పందించిన నిర్మాణ సంస్థ.. సెట్స్‌లో ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ నవ్వుతూ కనిపించిన దృశ్యాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. వారు నవ్వకుండా ఉండలేరు అంటూ పరోక్షంగా రూమర్స్‌ని ఖండించింది. దీంతో సలార్ 2 ఆగిపోయిందనే రూమర్స్ కి చెక్ పడినట్లయింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

#prabhas #pan-india-movie #prashanth-neel #salaar-2
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe