Telangana CM: ఇంకా వీడని సీఎం సస్పెన్స్.. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనవైపే మొగ్గు

తెలంగాణలో సీఎం ఎవరూ అనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పలువురు సీనియర్ నేతలు ముఖ్య శాఖలపై పట్టుబడటంతో ప్రమాణ స్వీకారం వాయిదా కార్యక్రమం వాయిదా పడింది. మంగళవారం మరోసారి దీనిపై చర్చించనున్నారు.

New Update
Telangana CM: ఇంకా వీడని సీఎం సస్పెన్స్.. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనవైపే మొగ్గు

తెలంగాణలో కాంగ్రెస్ అధికార పీఠం చేపట్టనుంది. అయితే ఇప్పటికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరూ అనే దానిపై ఇంకా సస్పన్స్ వీడలేదు. అయితే కాంగ్రెస్‌లోని మెజార్టీ ఎమ్మెల్యేలు సీఎంగా రేవంత్‌ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా పార్టీ హైకమాండ్‌ నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కొందరు సీనియర్ నేతలు సీఎం పదవికి తమ పేర్లు కూడా పరిశీలించాలని కోరారు. అలాగే ఎమ్మెల్యేల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారం అధిష్ఠానంవైపు వెళ్లింది. దీంతో అక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో సోమవారం జరగాల్సిన ప్రమాణ స్వీకరణ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే కొంతమంది నేతలు ముఖ్యశాఖలు తమకు కావాలంటూ పట్టుబట్టారు. దీంతో రాత్రివరకు హైకమాండ్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో పరిశీలకులను ఢిల్లీకి పంపించారు.

Also Read: ఏపీలో తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాన్.. తెలంగాణకు హెచ్చరిక

అలాగే డీకే శివకుమార్, మణిక్‌రావ్ ఠాక్రే కూడా ఢిల్లీకి వెల్లి ఖర్గేను కలిసి సీఎల్పీ సమావేశ వివరాలను ఆయనకు వివరించారు. మరోసారి మంగళవారం భేటీ అయ్యి చర్చిద్దామని ఖర్గే వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత ఈ విషయాన్ని సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఢిల్లీలోని ముఖ్యనేతలు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉన్నందువల్ల ఆలస్యం జరిగిందని.. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పేరునే అధికారికంగా వెల్లడించనున్నారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

Also Read: తెలంగాణలో మరో ఎన్నికలకు మోగిన నగారా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు