Road Accident : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షికార్‌పూర్ - బులంద్‌షహర్ రహదారిపై పికప్ వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది గాయపడ్డారు. మృతులందరూ అలీఘర్ జిల్లా (Aligarh District) లోని అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ (Raipur) ఖాస్ నాగ్లా గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం గాయపడినవారందరూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Also Read: ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో కళాశాల యాజమాన్య పాత్ర ?
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాయ్‌పూర్ ఖాస్ నాగ్లా గ్రామానికి చెందిన 40 మంది వ్యక్తులు బులంద్‌షహర్ రోడ్డులో ఉన్న ఓ ఫుడ్ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే వీళ్లందరూ ఆదివారం పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి తమ ఇళ్లకు బయలుదేరారు. అయితే సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు వీళ్లు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. 21 మంది క్షతగాత్రులయ్యారు. జిల్లా మెజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్, ఎస్‌ఎస్పీ శ్లోక్‌కుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. గాయాలపాలైనవారని పరామర్శించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also read: రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మారుస్తాం : కేటీఆర్