Mahua Moitra: ఒత్తిడి చేసి బలవంతంగా సంతకం చేయించారు.. మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు

పార్లమెంట్ సమావేశాల్లో అదానిపై ప్రశ్నలు అడిగేందుకు తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి, ఈ నేపథ్యంలోనే మహువా ఎక్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం.. హీరానందానిపై ఒత్తిడి తీసుకొచ్చి తెల్లకాగితంపై అందులో సంతకం చేయించిందని పేర్కొన్నారు. ఆ కాగితంలో ఉన్న సమాచారమే ఆ తర్వాత మీడియాకు లీక్ అయినట్లు పేర్కొన్నారు.

New Update
Mahua Moitra: ఒత్తిడి చేసి బలవంతంగా సంతకం చేయించారు.. మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు

Mahua Moitra: ఇటీవల బీజేపీ ఎంపీ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా డబ్బులు తీసుకున్నారని చెప్పడంతో రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ముహువా మొయిత్రా ఎక్స్ (Twitter) వేదికగా కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం.. హీరానందాని (Hiranandani)పై ఒత్తిడి తీసుకొచ్చి తెల్లకాగితంపై అందులో సంతకం చేయించిందని పేర్కొన్నారు. ఆ కాగితంలో ఉన్న సమాచారమే ఆ తర్వాత మీడియాకు లీక్ అయినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీయడానికే.. గౌతం అదీనీని మహువా లక్ష్యంగా చేసుకున్నారని హిరానందని గ్రూప్ సీఈవో దర్శన్ హీరానందాని గురువారం తెలిపారు. అదానీ సంస్థలపై లోక్‌సభ సమావేశాల్లో ప్రశ్నలు అడిగేందుకు ఆమెకు హీరానందానీ నగదు చెల్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం మొయిత్రా పార్లమెంటరీ లాగిన్‌ను ఉపయోగించుకున్నట్లు హిరానందాని అంగీకరించినట్లు ఓ వార్తా సంస్థ గుర్తించింది.

Also read: ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్..

దీనిపై స్పందించిన మహువా (Mahua) ఆ అఫడవిట్ విశ్వసనీయతను ప్రశ్నించారు. హీరానందానికి సీబీఐ (CBI), ఏథిక్స్ కమిటీ అలాగే ఇతర ఏ దర్యాప్తు సంస్థకు కూడా ఇంతవరకు సమన్లు పంపలేదు. అలాంటప్పుడు అతను ఆ అఫిడవిట్‌లో ఎవరికి ఇచ్చినట్లు. అఫిడవిట్ ఎందుకు అధికారిక లెటర్ హెడ్ రూపంలో లేదు. దానిని హీరానందని సోషల్ మీడియాలో చేయలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఆ సమాచారం లీక్ అయింది.అదానీని ప్రశ్నించేటటువంటి ప్రతి నేతను అణిచివేసే చర్యల్లో ఇది భాగమైపోయిందని.. మహువా మొయిత్రా ఈ విధంగా స్పందించారు. మరోవైపు హీరానందాని లేఖ ఇంకా తమకు అందలేదని.. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకార్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా.. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగడానికి మహువా మొయిత్రా( Mahua Moitra) డబ్బులు తీసుకున్నారాని, లోక్‌సభ వెబ్‌సైట్‌ లాగిన్ యాక్సెస్‌ను ఓ వ్యాపారవేత్తకు ఇచ్చారని భాజపా ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) ఆరోపణలు చేసిన సంగతి తెలిసిన విషయమే. 2019 నుంచి 2023 వరకు మహువా మొయిత్రా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకు అడిగారని దూబే ఆరోపించారు. అంతేకాదు ఈ వ్యవహారంపై ఆయన ఐటీ మంత్రిత్వ శాఖకు సైతం లేఖ రాశారు. ఆమెపై ఉన్న ఆరోపణలను అత్యంత తీవ్రమైనవిగా పరిగణించాలని.. అలాగే వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆయన ఐటీశాఖను అభ్యర్థించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు