Mahua Moitra: మహువా మొయిత్రాకు మరో షాక్‌.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు..

టీఎంసీ బహిష్కృత ఎంపీ మహువా మొయిత్రాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆమె ఎంపీ హోదాలో ఉంటున్న బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌(డీవోఈ) మరోసారి మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఆలస్యం అయితే అధికారులను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.

New Update
Mahua Moitra: మహువా మొయిత్రాకు మరో షాక్‌.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు..

Mahua Moitra : ఇటీవల టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌ సభ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పడు తాజాగా ఆమెకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం ఆమె ఎంపీ హోదాలో ఉంటున్న బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని (Notices to vacate Govt Bungalow) డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌(డీవోఈ) మంగళవారం నోటీసులు జారీ చేసింది. జనవరి 7లోపు బంగ్లాను ఖాళీ చేయాలని గత నెలలోనే ఆమెకు అధికారులు నోటీసులు పంపగా ఇప్పుడు మరోసారి నోటీసులు వెళ్లాయి. దీంతో సంబంధిత అధికారులు ఇవాల లేదా రేపు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఇలా కూడా ఉంటారా.. బతికుండగానే చావు భోజనం పెట్టింటాడు..

అయితే ఈ విషయంపై ఆమె ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌(DOE)కు విజ్ఞప్తి చేయాలని న్యాయస్థానం ఆమెకు సూచనలు చేసింది. జనవరి 7న ఆమె గడువు ముగియడంతో.. బంగ్లాలో ఎందుకు కొనసాగించాలో చెప్పాలంటూ జనవరి 8న డీవోఈ ఆమెకు నోటీసులు పంపింది. కానీ 3 రోజుల వరకు మహువా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో 12వ తేదీన మరోసారి నోటీసులు పంపించింది. చివరిక మహువా డీవోఈ ముందు హజరై ఈ విషయంపై వివరణ ఇచ్చారు.

కానీ మహువా (Mahua Moitra) చెప్పిన విషయాలు సంతృప్తికరంగా లేకపోవడం వల్ల.. వెంటనే ఎంపీ హోదాలో ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయాలని నిన్న ( మంగళవారం) మరోసారి నోటీసులు పంపించింది డీవోఈ. మరో విషయం ఏంటంటే ఆలస్యం అయితే ఆమెను బంగ్లా ఖాళీ చేయించేందుకు అధికారుల బృందాన్ని రంగాన్ని దింపుతామని కేంద్ర గృహ నిర్మాణశాఖ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా.. ఇటీవల అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీలపై లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న మహువా మొయిత్రా పై డిసెంబర్‌ 8వ తేదీన బహిష్కరణ వేటు పడిన సంగతి తెలిసిందే.

Also Read: భారత్, కెనడా వివాదం.. గణనీయంగా పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య

Advertisment
తాజా కథనాలు