Canada: భారత్, కెనడా వివాదం.. గణనీయంగా పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య

ఇండియా, కెనడాల మధ్య దౌత్యవిభేదాలు నెలకొన్న నేపథ్యంలో.. కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. వాళ్లకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గించేసింది. గతంతో పోలిస్తే దాదాపు 86 శాతం మంది భారతీయ విద్యార్థులు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

New Update
Canada: భారత్, కెనడా వివాదం.. గణనీయంగా పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య

India-Canada Row: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తడంతో.. కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల (Indian Students) సంఖ్య తగ్గిపోయింది. వాళ్లకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గించేసింది. 2023లో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే జరీ చేసింది. అంతకు ముందు ఈ సంఖ్య 1,08,940గా ఉంది. అంటే దాదాపు 86 శాతం భారతీయ విద్యార్థులు తగ్గిపోయారు.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్‌ నిజ్జర్ హత్య భారతీయ ఏజెంట్లు ఉన్నారని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) ఇటీవల ఆరోపణలు చేయడంలో ఇరుదేశాల మధ్య దౌతపరమైన విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఉన్న రాయబారులను తగ్గించుకోవాలి అని భారత్‌ కెనడాకు సూచించింది. దీంతో కెనడా 41 మంది దైత్యాధికారులను తమ స్వదేశానికి పిలిపించింది. ఇలాంటి తరుణంలో పెద్ద సంఖ్యలో స్టడీ పర్మిట్లను ప్రాసెస్ చేయడం కుదరని.. కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్‌ మిల్లర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Also Read: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే..

విదేశీ విద్యార్థులే ఆదాయ వనరు

భవిష్యత్తులో ఈ స్టడీ పర్మిట్లను జారీ చేసే సంఖ్య కూడా గణనీయంగా పెరిగే సంకేతాలు కనిపించడం లేవన్నారు. ఇదిలాఉండగా.. కెనడాలో చదువుకోవడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా ఉంటారు. 2022లో 22,835 స్టడీ పర్మీట్లు జారీ చేశారు. ఇందులో 41 శాతం భారత విద్యార్థులే దక్కించుకున్నారు. మరో విషయం ఏంటంటే కెనడాలోని యూనివర్శిటీలకు విదేశీ విద్యార్థులు రావడమే ప్రధాన ఆదాయ వనరు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్యకు భారతీయ ఏజెంట్లే కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన నిరాధార ఆరోపణలు ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలను రాజేసిన విషయం తెలిసిందే. దీంతో దిల్లీలోని తమ రాయబారులను భారీ సంఖ్యలో తగ్గించుకోవాలన్న భారత ప్రభుత్వ సూచన మేరకు కెనడా 41 మంది దౌత్యాధికారులను (Diplomats) వెనక్కి తీసుకుంది.

Also Read: ఇకనుంచి వాతావరణ సమాచారం మీ చేతిలోనే.. యాప్‌ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి..

విద్యార్థులు వలసలు పెరిగాయి

ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో స్టడీ పర్మిట్లను ప్రాసెస్‌ చేయడం కుదరడం లేదని ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సమీప భవిష్యత్తులో పర్మిట్ల జారీ గణనీయంగా పెరిగే సంకేతాలూ కనిపించడం లేదని పేర్కొన్నారు. అలాగే విదేశీ విద్యార్థుల వలసలు కూడా ఎక్కువగా పెరిగిపోయాయని.. దీనివల్ల కెనడాలో నిరుద్యోగం, ఇళ్ల కొరత సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కూడా మిల్లర్‌ ఇటీవల అన్నారు. అందుకే తమ దేశంలో ఉండే విదేశీ విద్యార్థులప పరిమితి విధించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు