Jawan Movie: నువ్వెప్పుడూ సినిమాకి వెళ్తే..అప్పుడూ నేను కూడా వస్తా!

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్..టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మధ్య ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu)జవాన్‌ సినిమా కోసం షారూక్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు..కుటుంబ సమేతం గా సినిమాని చూడాలనుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు

Jawan Movie: నువ్వెప్పుడూ సినిమాకి వెళ్తే..అప్పుడూ నేను కూడా వస్తా!
New Update

గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాలీవుడ్‌ బాద్‌ షా షారూక్ ఖాన్‌ (Sharukh Khan) సినిమా జవాన్‌ (Jawan) గురించి ఇప్పటికే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. పఠాన్‌(Paatan)  సినిమాతో భారీ వసూళ్లను రాబట్టిన షారూక్‌ ఈ సినిమాతో ఆ రికార్డును తిరగరాయాలనుకుంటున్నాడు. జవాన్ సినిమా విడుదల సందర్భంగా ఇప్పటికే షారూక్‌ కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే బాలీవుడ్‌ సూపర్‌ స్టార్..టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మధ్య ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu)జవాన్‌ సినిమా కోసం షారూక్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు..కుటుంబ సమేతం గా సినిమాని చూడాలనుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

సినిమా సూపర్ హిట్‌ కావాలని ఆయన కోరుకుంటున్నట్లు కూడా వివరించారు. ఈ ట్వీట్ ను చూసిన షారూక్‌ వెంటనే మహేష్‌ ట్వీట్‌ కు రీ ట్వీట్ చేశారు. '' థ్యాంక్యూ సో మచ్‌ మై డియర్‌ ఫ్రెండ్‌..నువ్వెప్పుడు సినిమా చూడాలనుకుంటున్నావో చెబితే..నేనూ కూడా నీతో కలిసి సినిమాకి వస్తాను. మీకు మీ కుటుంబ సభ్యులకు కచ్చితంగా మా జవాన్ సినిమా నచ్చుతుందని నా నమ్మకం'' అని ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు మహేష్‌ అభిమానులు, ఇటు షారూక్‌ అభిమానులు ఇద్దరు కూడా ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. జవాన్‌ సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సుమారు 4 లక్ష ల వరకు అడ్వాన్స్‌ టికెట్లు బుక్‌ అయ్యాయి. పఠాన్‌ సినిమా రికార్డులను తిరగారాయాలనుకున్న జవాన్‌ కు ఇది మంచి పరిణామామనే చెప్పవచ్చు.

జవాన్‌ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో షారూక్‌ తన కుమార్తె, నటి నయనతారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా షారూక్‌ అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా ముచ్చటిచ్చారు.

#bollywood #sharukh-khan #mahesh-babu #jawan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి