Namratha: మహేష్ బాబు (Mahesh Babu) సతీమణి, నటి నమ్రత (Namratha)శిరోద్కర్ సోషల్ మీడియాలో అభిమానులను ఉద్దేశిస్తూ పెట్టిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ అవుతోంది. మహేష్ అప్ కమింగ్ మూవీ 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగగా.. ఈ వేడుకకు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. దీంతో మహేష్ పై ఉన్న వారి అభిమానం చూసి ఆనందం వ్యక్తం చేసిన నమ్రత.. మీరొక ఎమోషన్.. ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా అంటూ మురిసిపోయింది.
View this post on Instagram
'MB తన అభిమానులకు, సూపర్ ఫ్యాన్స్‌కు ఎంతగా నచ్చాడనే దాని గురించి మాట్లాడే చివరి వ్యక్తి బహుశా నేనే! మన రెండు రాష్ట్రాల ప్రజలేకాదు ప్రపంచవ్యాప్తంగా చాలామంది అతనిపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. అన్ని సమయాల్లో అతనికి మద్దతుగా ఉన్నారు. అతనిని మరింత కష్టపడి పనిచేసేలా ప్రోత్సహించారు. కానీ ఈరోజు మా సొంత ఊరు గుంటూరులో ఆయనకు, ఆయన జీకే టీమ్‌కు లభించిన ఆదరణ చూసి గర్వంగా ఒక మాట చెప్పగలుగుతున్నా. MB, మీరు మీ ప్రజలకు ఎమోషన్‌గా మారారని. ఈ ప్రేమను కుటుంబసభ్యులుగా మనం ఆదరిస్తాం. మనం జీవించి ఉన్నంత కాలం' అంటూ లవ్ సింబల్స్ జత చేసింది.
ఇది కూడా చదవండి : Mohammad Shami:నా దేశానికి బెస్ట్ ఇవ్వడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా..మహ్మద్ షమీ
అలాగే 'మేము ఎల్లప్పుడూ మా ప్రేమను విభిన్న మార్గాలు, రూపాల్లో చూపిస్తామని నేను చెప్పాలనుకుంటున్నా. మీరు దానిని ఆదరిస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నా. ఆయనను ఎంతో ప్రేమగా ప్రేమిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది' అంటూ తనదైన స్టైల్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇక మహేష్ హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలీల కథనాయికగా నటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో థమన్ సంగీతం అందించాడు.