/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-76-jpg.webp)
Mahesh Babu New Look : రాజమౌళి(Rajamouli) సినిమా కోసం సూపర్ స్టార్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ మూవీ కోసం తన శరీరాకృతిని మార్చుకుంటున్నారు. దానికి తోడు హెయిర్ స్టైల్‌ను కూడా చస్త్రంజ్ చేశారు. మామూలుగానే మహేష్(Mahesh Babu) సూపర్ హ్యాండ్సమ్‌గా ఉంటారు. ఇప్పుడు రాజమౌళి సినిమాకు చేసిన మేకోవర్‌తో మరింత మెరిసిపోతున్నారు. సినిమా మొదలయ్యే లోపున యాడ్స్ చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. రీసెంట్‌గా చేసిన అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో అభి బస్, మౌంటెన్ డ్యూ యాడ్స్ చేశారు. ఇందులో కొత్త లుక్‌తో వావ్ అనిపిస్తున్నారు.
లుక్ మార్చుకున్న దగ్గర నుంచీ మహేష్‌బాబు తన సోషల్ మీడియా(Social Media) లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త యాడ్ వీడియోను కూడా షేర్ చేశారు. మహేష్ బాబు మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ కు సంబంధించిన కొత్త యాడ్ లో మహేష్ హాలీవుడ్ హీరోగా కనిపించారు. ఇందులో యాక్షన్ సీన్స్ తోపాటు మహేష్ న్యూలుక్ కూడా హైలెట్ అయ్యింది.హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో ఉంది కొత్త యాడ్. గత మూడు నాలుగు రోజులుగా మహేష్ న్యూలుక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇన్ స్టాలో మహేష్ పెట్టిన పోస్ట్ వైరలవుతోంది. మహేష్ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి తీసే సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది అని ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టే మహేష్ లుక్ ఉందని అంటున్నారు.
View this post on Instagram
Atttt….. finally thumsup Ad ki competition iche range Ad from Mountain Dew😍😍
Hollywood material…🔥🔥@urstrulyMahesh iragakummav..😍🔥@ssrajamouli #SSMB29 KMPD eh🥵 pic.twitter.com/kTw54XDruG
— vamsi (@urstruly_vamsi) March 10, 2024
ఇక రాజమౌళి..మహేష్‌తో తీస్తున్న సినిమా ఇండియానా జోన్స్(Indiana Zones) తరహాలో అమెజాన్ ఫారెస్ట్(Amazon Forest) నేపథ్యంలో తెరకెక్కబోతోంది. కె. ఎల్ నారాయణ, ఎస్.గోపాల్‌రెడ్డి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది మేలో సినిమా షూటింగ్ మొదలవతుందని అంటున్నారు.
Also Read : Andhra Pradesh: ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల