Guntur Kaaram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం గుంటూరు కారం(Guntur Kaaram). ప్రస్తుతం మహేష్ బాబు ఫోకస్ అంతా ఈ సినిమా పైనే పెట్టారు. మేకర్స్ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12 పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గుంటూరు కారం సంక్రాంతి బరిలో ఉన్నందున చిత్ర బృదం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ రాబోతున్న మాస్ యాక్షన్ మసాలా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో త్రివిక్రమ్ మహేష్ బాబును కొత్త లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారంలో మహేష్ బాబు(Mahesh Babu) సరసన శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి కనిపించనున్నారు.
పూర్తిగా చదవండి..Guntur Kaaram: ‘కేరళలో’ మహేష్ బాబు గుంటూరు కారం..!
మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గుంటూరు కారం'. ఇప్పటికే ఈ సినిమా నుంచి "దమ్ మాసాల" పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ సినిమాలోని ఒక పాటను షూట్ చేయడానికి కేరళ వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.
Translate this News: