/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-29T143530.812-jpg.webp)
Guntur Kaaram Song : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది . రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యునిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా తాజాగా సినిమా నుంచి మాస్ బీట్ 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ రిలీజ్. రిలీజైన కొద్దీ సేపట్లోనే ఈ పాట నెట్టింట్లో చర్చగా మారింది. కుర్చీ మడతపెట్టి అంటూ మొదలైన ఈ సాంగ్ లిరిక్స్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుర్చీ మడతపెట్టి అనేది ఒక బూతు డైలాగ్. ఏదో ఒక యూట్యూబ్ ఛానెల్ లో ఒక ముసలి వ్యక్తి చెప్పగా అది ఫేమస్ అయ్యింది. ఈ పదాన్ని మహేష్ బాబు పాటలో మొదటగా పెట్టడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: Ravi Teja Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ షూట్ బిగిన్స్.. మరో సారి మాస్ కాంబో రిపీట్..!
రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజైన సెకండ్ సాంగ్ 'ఓ మై బేబీ'(Oh My Baby) పాట పై కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ విషయంలో లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి, ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. ఈ కారణంగా రామజోగయ్య శాస్త్రి తన సోషల్ మీడియా అకౌంట్ కూడా డీ యాక్టివేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విడుదలైన "కుర్చీ మడతపట్టి" సాంగ్ లిరిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్, అలాగే లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి సహా పాట లిరిక్స్ ఒకే చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. ఒరేయ్ (Orey) అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా పాటల విషయంలో ఇంత అశ్రద్ధ ఏంటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఫ్యాన్స్ మ్యూజిక్ బాగుందని కూడా కామెంట్స్ చేస్తున్నారు. కానీ మహేష్ బాబు పాటకు ఇలాంటి పదాలు వాడడం బాగాలేదంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. ఈ సినిమాను హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.
Eh chi kurchimadatha pettadam enti chiragga insta batch antha labour antha intha dhigajaraala manam enti mana hero enti
BUT
Businessman uncensored kavaali 🤣 pic.twitter.com/Ep58ezc8pa
— $!v@ 🌶 (@siva4ssmb) December 29, 2023
Kurchi ni madatha pettakunda kurchoni alochisthe better song rasevaru emo https://t.co/ghrECZIHYd pic.twitter.com/mYas7xRUeR
— jokerx😈 (@xAJokerx) December 29, 2023
Also Read: Guntur Karam Song: గుంటూరు కారంలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్.. యూట్యూబ్ లో యమ ట్రెండింగ్!