Guntur Kaaram: మొత్తానికి 'రాజీ' కనిపించింది.. మీనాక్షి చౌదరి పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ఈ మూవీలో ఇద్దరు ఫిమేల్ లీడ్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. కానీ ఇప్పటి వరకు మేకర్స్ మీనాక్షి పాత్రను రివీల్ చేయలేదు. తాజాగా మీనాక్షి పాత్ర 'రాజీ' ని ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
Guntur Kaaram: మొత్తానికి 'రాజీ' కనిపించింది.. మీనాక్షి చౌదరి పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

Meenakshi Chaudhary: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో రాబోతున్న 3వ సినిమా గుంటూరు కారం. ఇప్పటికే ఈ సినిమా సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. సినిమా పాటలు, టీజర్ సినిమా పై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్న 'గుంటూరు కారం' (Guntur Kaaram) సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మీనాక్షి పాత్రకు సంబంధించిన విజువల్స్ మేకర్స్ ఎక్కడా కూడా రివీల్ చేయలేదు.

Meenakshi Chaudhary

Also Read: Guntur Kaaram: గుంటూరు కారంలో సూపర్ స్టార్ కృష్ట.. ఫ్యాన్స్ కు నిజంగా సంక్రాంతే!

మీనాక్షి చౌదరి పోస్టర్ రిలీజ్

ఇప్పటికే రిలీజైన ఓ 'మై బేబీ', కుర్చీ మడతపెట్టి (Kurchi Madatha Petti) రెండు సాంగ్స్ లో శ్రీలీలే కనిపించింది. దీంతో అభిమానుల్లో మీనాక్షి కేవలం చిన్న పాత్రకే పరిమితమా..? అసలు ఆమె క్యారెక్టర్ సినిమాలో ఉందా..? అనే డౌట్ కూడా వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పోస్టర్ తో ఈ అనుమానాలకు చెక్ పడింది. సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) పాత్ర 'రాజీ' క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో హాఫ్ శారీతో ట్రెడిషనల్ గా కనిపించింది మీనాక్షి.

హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన కుర్చీ మడతపెట్టి సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మొదట్లో విపరీతంగా ట్రోల్ అయినప్పటికి.. ప్రస్తుతం బాగానే ట్రెండ్ అవుతోంది. రిలీజైన 5 రోజుల్లోనే 19 మిలియన్ వ్యూస్ సొంత చేసుకొని యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ గా సాగుతుంది.

Also Read: Bigg Boss: ఆ కంటెస్టెంట్ కోసం.. చిరంజీవి రోజూ బిగ్ బాస్ చూసేవారట.. ఎవరో తెలుసా..!

Advertisment
తాజా కథనాలు