Mahesh Babu: వివాదంలో మహేశ్ బాబు..ఆ వీడియో తొలగించడంతో ..! పాన్ బహార్ బ్రాండ్‌ని ప్రమోటింగ్ చేయడంపై మహేష్ పై నెట్టింట నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఇలాంటి హానికరమైన ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వాటిని మహేష్ ప్రమోట్ చేయటం ఏంటని..? అసలు అలాంటి ఈవెంట్‌కు ఆయన హాజరవ్వడంపై కూడా తప్పుపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదివేయండి. By Bhavana 30 Apr 2024 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్లు బాగానే రాబట్టింది. తాజాగా మహేష్ మరో ప్రాజెక్ట్‌లో బిజీ అయిపోయాడు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్లు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక సినిమాలతో కాకుండా మహేశ్ బాబు పలు బిజినెస్ యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఇండియన్ టాప్ మోస్ట్ కార్పొరేట్ బ్రాండ్స్ అన్నీ మహేష్ బాబు చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. తమ ప్రొడక్ట్స్ కోసం కోట్లాది రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే మహేశ్ చాలా యాడ్స్ చేస్తు బిజీగా ఉంటున్నారు. కొంతకాలం క్రితం ఫ్లిప్ కార్ట్ యాడ్స్ లో కనిపించిన మహేష్ తాజాగా పాన్ బహార్ బ్రాండ్‌ని కూడా ప్రమోట్ చేశారు. అంతా బాగానే ఉన్నా ఈ పాన్ బహార్ బ్రాండ్‌ని ప్రమోటింగ్ చేయడంపై మహేష్ పై నెట్టింట నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఇలాంటి హానికరమైన ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వాటిని మహేష్ ప్రమోట్ చేయటం ఏంటని..? అసలు అలాంటి ఈవెంట్‌కు ఆయన హాజరవ్వడంపై కూడా తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతుండగా.... ఆ వీడియో ఎవరు ప్రిపేర్ చేశారు, ఎవరూ పోస్ట్ చేశారో తెలియదు. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే.. తర్వాత ఆ వీడియో సోషల్ మీడియా నుంచి డిలీట్ అయింది. అయితే దీనిని డిలీట్ చేయించింది అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనా ఈ వీడియో మాయమవడంపై పలు అనుమానులు కూడా ఉన్నాయి.. కానీ ఫ్యాన్స్ మాత్రం వీడియో డిలీట్ కావడంతో కాస్త సంతోషిస్తున్నారు. Also read: వందేళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎండలు..అది కూడా కేవలం ఏప్రిల్ నెలలోనే! #video #viral #mahesh-babu #social-media #movies #adds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి