Mahender Reddy : మచ్చలేని అధికారిని.. అవినీతి ఆరోపణలపై స్పందించిన మహేందర్ రెడ్డి

ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. 'నా కెరీర్ మొత్తం అంకిత భావంతో విధులు నిర్వర్తించాను. క్లీన్ రికార్డ్‌ను మెయింటెన్ చేశాను. నాపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధం. నిరాధారమైనవి' అంటూ ఖండించారు.

New Update
Mahender Reddy : మచ్చలేని అధికారిని.. అవినీతి ఆరోపణలపై స్పందించిన మహేందర్ రెడ్డి

Hyderabad : ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి(Mahender Reddy) స్పందించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించారని, హైదరాబాద్(Hyderabad) నగరంతోపాటు పలు జిల్లాల్లో అత్యంత ఖరీదైన భూములను తన పేరు మీద, కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద అక్రమంగా సంపాదించాడంటూ భాస్కర్ ఏసీపీ, డీజీపీలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

publive-image

మచ్చ లేని కెరీర్..
అయితే భాస్కర్ ఆరోపణలపై వివరణ ఇచ్చిన మహేందర్ రెడ్డి.. ఓ లెటర్ రిలీజ్ చేశారు. 'నేను ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు శాఖలో పనిచేశాను. అలాగే తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్ లోనూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాను. నా పదవీ విరమణ వరకు 36 సంవత్సరాలకుపైగా విధుల్లో ఏ మాత్రం మచ్చ లేకుండా జాగ్రత్తపడ్డాను.  నా కెరీర్ మొత్తంలో నేను క్లీన్ రికార్డ్‌ను మెయింటెన్ చేశాను. ఇంతటి కీర్తి ఉన్న నాపై అసత్య ఆరోపణలు చేయడం దురదృష్టకరం. నన్ను కించపరచాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా(Social Media) లో ఈ రకమైన ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధం. నిరాధారమైనవి' అంటూ ఖండించారు.

అసలేం జరిగింది..
ఈ మేరకు ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్.. పోలీసు శాఖలో డీజీపీ పోస్ట్​ సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్​రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లెక్కలేనని అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూ.లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే సంపదను పోగు చేసుకున్నారు. మహేందర్​రెడ్డి చేసిన అక్రమాల్లో 40 వాటికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని తెలిపారు. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్న రాపోలు భాస్కర్ ​దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ గవర్నర్​ తమిళసై సౌందర్​రాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌లకు ఫిర్యాదులు చేశారు.

ఇది కూడా చదవండి : Tamil Nadu: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన రజనీకాంత్‌.. ఏమన్నారంటే

టీఎస్పీఎస్సీ(TSPSC) చైర్మన్‌గా ఆయన మరోసారి అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని​అనుమానాలను వ్యక్తం చేశారు. గ్యాంగ్‌స్టర్​ నయీంతో పాటు పలువురు అసాంఘిక శక్తులతో సంబంధాలు ఉన్న మహేందర్​రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్, నల్గొండ, మెదక్​ తదితర జిల్లాల్లో కొంత మంది పోలీసు అధికారులను ఉపయోగించుకుని పెద్ద సంఖ్యలో భూములను తన పేర, తన బినామీల పేర మార్చుకుని రియల్టర్లకు డెవెలప్‌మెంట్‌కు ఇవ్వడం ద్వారా రూ.వందల కోట్లు సంపాదించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు