Fake IAS: ఫేక్‌ సర్టిఫికేట్లతో ఏకంగా IAS ఉద్యోగం.. ఎలా దొంగ అధికారి ఎలా దొరికారంటే?

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2023 ఐఏఎస్ బ్యాచ్‌ అధికారి పూజా ఖేద్కర్ వివాదంలో ఇరుక్కున్నారు. ఫేక్ సర్టిఫికేట్లు చూపించి ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (IAS)లో ఉద్యోగం పొందారని ఫిర్యాదు నమోదైంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Fake IAS: ఫేక్‌ సర్టిఫికేట్లతో ఏకంగా IAS ఉద్యోగం.. ఎలా దొంగ అధికారి ఎలా దొరికారంటే?
New Update

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2023 ఐఏఎస్ బ్యాచ్‌ అధికారి పూజా ఖేద్కర్ వివాదంలో ఇరుక్కున్నారు. ఫేక్ సర్టిఫికేట్లు చూపించి ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (IAS)లో ఉద్యోగం పొందారని ఫిర్యాదు నమోదైంది. ఇక వివరాల్లోకి వెళ్తే సెంట్రల్ అడ్మినిస్టేషన్ ట్రిబ్యునల్ (CAT)కి సమర్పించిన డాక్యుమెంట్స్ ప్రకారం.. డా.  పూజా ఖేద్కర్ ఓబీసీ కేటగిరి అలాగే వికాలంగుల కేటగిరీ కింద యూపీఎస్సీ పరీక్ష రాశారు. అలాగే యూపీఎస్సీకి మానసిక అనారోగ్య సర్టిఫికేట్‌ను కూడా సమర్పించారు. చివరికి పూజా సెలెక్ట్‌ అయ్యాక.. సెలక్షన్ కమిటీ వాళ్లు.. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఆమె అంగవైకల్య ధృవీకరణ పత్రాన్ని పరిశీలించి, వైద్య పరీక్షలు చేసి నిజనిర్ధారణ చేసేందుకు పిలిపించారు. అయినప్పటికీ కూడా కరోనా సాకుతో ఆమె ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు హాజరవ్వలేదు.

Also Read: చరిత్రలో తొలిసారి.. రికార్డుల్లో పేరుతో పాటు జెండర్ మార్చుకున్న మహిళా ఐఆర్ఎస్ అధికారి

ఇలా ఎయిమ్స్‌ వాళ్లు వైద్య పరీక్షల కోసం ఐదుసార్లు పిలిచినప్పటికీ ఆమె వివిధ కారణాలు చెప్పి నిరాకరించింది. చివరికి పూజా ఒక స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఫేక్‌ డిసబిలిటీ వెరిఫికేషన్‌ రిపోర్టును సంపాదించింది. ఈ ఫేక్‌ రిపోర్టుతో పుణేలో ప్రొబిషనరీ అధికారిగా జాయిన్‌ అయ్యింది. అయితే యూపీఎస్సీ.. ఆమె సమర్పించిన సర్టిఫికేట్‌ను సీఏటీ (CAT)లో సవాలు చేసింది. అయినప్పటికీ కూడా ఆమెకు రాజకీయ పలుకుబడి ఉండటంతో జాయినింగ్ ఆర్టర్‌ను పొందింది. ఇక ప్రొబేషనరీ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యిక.. ఒక కాంట్రక్టర్ నుంచి తీసుకున్న ఆడీ కారుకు వీఐపీ నెంబర్ కావాలంటూ డిమాండ్ చేసింది. రూల్స్ ప్రకారం.. అధికారులు ప్రభుత్వ పనుల కోసం ప్రైవేట్ కాంట్రక్టర్ల వాహనాలు వాడకూడదు. అయినా కూడా పూజా తనకున్న పొలికల్ ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఇదంతా చేసింది. అలాగే తాను ఒక ఐఏఎస్ అధికారి అని చూపించుకునేందుకు ఆ ఆడీ కారుపై రెడ్‌ బీకాన్‌ను కూడా పెట్టించుకుంది.

అంతేకాదు పూజా ఖేద్కర్‌.. పూణె అదనపు కలెక్టర్‌ ఛాంబర్‌ను ఆక్రమించుకుంది. అలాగే తన కోసం ప్యూన్ ఇతర సిబ్బందిని నియమించాలంటూ డిమాండ్ చేసింది. పూజా స్వభావాన్ని చూసి చివరికి స్టేట్‌ చీఫ్ సెక్రటరీ ఆమెపై ఫిర్యాజు చేశారు. దీంతో ప్రభుత్వం ఆమెను పూణె నుంచి వాసిమ్‌ జిల్లాకు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా బదిలీ చేసింది. రూల్స్ ప్రకారం.. ఒక అధికారికి తన మొదటి పోస్టింగ్‌లో సొంత జిల్లాలో పనిచేసేందుకు అనుమతి ఉండదు. అయినా కూడా పూజా.. తన రాజకీయ పలుకుబడితో తన సొంత జిల్లా అయిన పూణెలో పోస్టింగ్‌ వేయించుకుంది.

Also Read: పతంజలి నుంచి 14 రకాల వస్తువులు బ్యాన్.. రాందేవ్ బాబా నిర్ణయం

మరో విషయం ఏంటంటే.. ఆమె ఓబీసీ కేటగిరి కింద సివిల్స్ పరీక్ష రాసింది. దానికి సంబంధించిన సర్టిఫికేట్‌లో కూడా తన తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలుగా రాయించుకుంది. కానీ వాస్తవానికి పూజ తండ్రి దిలీప్‌ ఖేద్కర్‌ ఒక రిటైర్ట్‌ ప్రభుత్వ అధికారి. వారి వార్షిక ఆదాయం రూ.49 లక్షలు. ఆస్తి విలువ రూ.40 కోట్లు. ఇంకా వాళ్లకున్న మిగతా ఆస్తులన్నీ కలిపితే ఏకంగా రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. అంతే కాదు.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా పూజా ఖేద్కర్‌ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం గమనార్హం. ఈ వివాదాలన్నీ ఇప్పుడు చర్చనీయాశం కావడంతో ఆమె ఉద్యోగంలో కొనసాగుతారా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనే అంశం చర్చనీయాంశమైంది.

#maharashtra #telugu-news #national-news #ias
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe