SHARUKH KHAN:షారూఖ్ ఖాన్‌కు బెదిరింపు-భద్రత పెంచిన ప్రభుత్వం

బాలీవుడ్ బాద్షా షారూఖ్‌ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు Y+ భద్రతను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్‌గా గుర్తు తెలియని వ్యక్తులు షారూఖ్‌ను చంపేస్తామంటూ లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

SHARUKH KHAN:షారూఖ్ ఖాన్‌కు బెదిరింపు-భద్రత పెంచిన ప్రభుత్వం
New Update

పఠాన్ జవాన్ సినిమాలతో వసూళ్ళ రికార్డులను బద్దలుకొట్టాడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో బాలీవుడ్ కు హుషారు తీసుకువచ్చాడు. కానీ బాద్షా ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను బెదిరిస్తూ లేఖలను రాయడమే దీనికి కారణం. ఈ లేఖల గురించి షారూఖ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆయనకు భద్రతను పెంచింది. Y ప్లస్ సెక్యూరిటీ కింద షారుక్ కు 11 మందితో భద్రతను ఏర్పాటు చేశారు. వీరిలో ఆరుగురు కమెండోలు కాగా, మిగిలిన నలుగురు రాష్ట్ర వీఐపీ సెక్యూరిటీ వింగ్ కు చెందినవారు.

పఠాన్ సినిమా సమయంలో కూడా షారుక్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సెక్యూరిటీగా ఏర్పాటు చేసింది. దీనికి తోడు షారుక్ కు తన సొంత బాడీగార్డ్స్ కూడా ఉన్నారు. అయితే, షారుక్ కు ఎలాంటి బెదిరింపులు వచ్చేయనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. తాజాగా షారుక్ భద్రతపై హై పవర్ కమిటీ సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేసింది. ఈ సూచనల నేపథ్యంలోనే ఆయన భద్రతను Y ప్లస్ కేటగిరీకి పెంచారు. షారుక్ భద్రతా సిబ్బంది ఎంపీ-5 మెషీన్ గన్స్, ఏకే 47 అస్సాల్ట్ రైఫిల్స్, గ్లోక్ పిస్టళ్లను కలిగి ఉంటారు. దీంతోపాటు... షారుక్ నివాసం చుట్టూ 24 గంటలూ పోలీసులు పహారాలో ఉంటారు.

ఇక షారూఖ్ నటించిన జవాన్ మూవీ రికార్డ్ కలెక్షన్లతో మోత మోగించింది. అట్లి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా కేవలం 18 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికోట్ల వసూళ్ళను సాధించి కొత్త రికార్డును సృష్టించింది.ఈ సినిమాతో ఒకే ఏడదిలో రెండు వెయ్యి కోట్ల కలెక్షన్ దాటిన సినిమాల్లో నటించిన ఏకైక హీరోగా షారుక్ ఖాన్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది మొద‌ట్లో విడుదలైన షారుక్ ఖాన్ పఠాన్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభించిన సంగతి తెలిసిందే. వేయికోట్ల మైలురాయని దాటింది. తాజాగా జవాన్ తో ఈ రికార్డును షారుక్ రీ బ్రేక్ చేశాడు.

#security #sharukh-khan #bollywood #maharastra-government
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe