Maharashtra: వివాదంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్..అసలేం జరిగింది అంటే?

మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదం చిక్కుకున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తతో కాళ్ళు కడిగించుకోవడం గొడవకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

New Update
Maharashtra: వివాదంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్..అసలేం జరిగింది అంటే?

Nana Patole: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అకోలా జిల్లాలోని వాడేగావ్‌ అనే ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ పర్యటన ముగించుకున్న తర్వాత తిరిగి వెళ్ళడానికి కారులో కూర్చున్నారు. అయితే అక్కడ ఈ మధ్యనే బాగా వర్షాలు కురిశాయి. దీని కారణంగా ఆ ప్రాంతం అంతా బురద బురదగా మారింది. దీంతో తన కాళ్ళను కడుక్కునేందుకు నీళ్ళు తేవాలని కాంగ్రెస్ కార్యకర్తకు చెప్పారు. అయితే ఆ సదరు కార్యకర్త నీళ్ళు తేవడమే కాకుండా ఏకంగా పటోలే పాదాలే వాటితో శుభ్రం చేశారు. దీన్నంతా ఎవరో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇప్పుడు ఈ వీడియో మీద బీజేపీ (BJP) మండిపడుతోంది. ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ముంబై బీజేపీ. పార్టీ కోసం కష్టపడేవారిని ఇలానేనా అవమానించేది అంటూ విమర్శిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే దీనికి సమాధానం చెప్పాలంటూ అడుగుతోంది.

Also Read:Bengaluru: జూదానికి బానిసైన విద్యార్ధిని..ఆత్మహత్య

Advertisment
తాజా కథనాలు