Breaking: మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం

మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. శంకరాచార్య మార్గ్‌లోని సెక్టార్ 18లో అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

New Update
maha fire

maha fire Photograph: (maha fire)

ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. శంకరాచార్య మార్గ్‌లోని సెక్టార్ 18లో అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఇది కూడా చూడండి:అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన

ఇది కూడా చూడండి:Delhi BJP : ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు?... లిస్టులో ఉన్నది వీళ్లే!

తొక్కిసలాట జరిగి 30 మంది..

ఇదిలా ఉండగా ఇప్పటికే రెండు సార్లు కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. జనవరి 19న వివేకానంద సేవా సమితి టెంట్‌లో భోజనం వండుతుండగా మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా గుడారాలు అన్ని కూడా మంటలకు కాలిపోయాయి. క్షణాల్లో అగ్గి భారీ ఎత్తున ఎగిసిపడటంతో భక్తులంతా పరుగులు తీశారు. అలాగే దీనికి ముందు కూడా పుణ్య స్నానాలకు వచ్చిన భక్తులు మృతి చెందారు. మహాకుంభమేళాకు మౌని అమావాస్య నాడు వెళ్లి పవిత్ర స్నానం ఆచరిస్తే పుణ్యమని భారీ సంఖ్యలో భక్తులు వెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతో దాదాపుగా 30 మంది మృతి చెందారు. 

ఇది కూడా చూడండి:America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!

ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్‌ గ్యాప్‌ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?

Advertisment
తాజా కథనాలు