Andhra Pradesh : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో(AP Politics) కీలక మార్పులు జరుగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ(YCP) కి షాక్ మీద షాక్ తగులుతున్నాయి. ఎంతో కాలంగా ప్రకాశం జిల్లా(Prakasam District) లో కీలక నేతగా ఉన్న ఎంపీ మాగుంట(Magunta Sreenivasulu Reddy) పార్టీకి బైబై చెప్పేసి.. సైకిల్ ఎక్కేస్తున్నారు. ఇన్నాళ్లు తిరిగిన ఫ్యాన్ ను ఇక ఆయన కట్టేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కి టికెట్ లేదని చాలా కాలం నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఆయన బుధవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఆయన టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు.
గత 34 సంవత్సరాలుగా మాగుంట కుటుంబం ఒంగోలులో(Ongole) రాజకీయాలు చేస్తోంది. మాగుంట కుటుంబాన్ని ప్రకాశం ప్రజలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా అక్కున చేర్చుకున్నారు. వారంతా కూడా మమ్మల్ని కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నట్లు మాగుంట వివరించారు. ఈ 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో 8 సార్లు పార్లమెంట్ కి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాం.
మా కుటుంబం ఎప్పుడూ కూడా గౌరవాన్నే కోరుకుంది. రాబోయే ఎన్నికల గురించి మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు బాధాకరంగా ఉన్నాయంటూ మాగుంట ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు ఆత్మగౌరవానికి సంబంధించినవి. అనివార్య పరిస్థితుల్లోనే వైసీపీని వీడాలనుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఐదేళ్లలో సీఎం జగన్(CM Jagan) నుంచి మాకు పూర్తి సహాయ సహకారాలు అందాయని మాగుంట వివరించారు. అందుకు మేము ఎప్పుడూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
పార్టీని విడిచిపెట్టడం ఎంతో బాధగా ఉందని వివరించారు. త్వరలోనే తమ భవిష్యత్తు రాజకీయాల గురించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read : డైరెక్టర్ క్రిష్ కి డ్రగ్స్ పరీక్షలు!