చనిపోయిన కొడుకు ఆస్తిలో తల్లికి వాటా ఉంటుందా?: హైకోర్టు సంచలన తీర్పు

చనిపోయిన కొడుకు ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదంటూ మద్రాస్​హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వారసత్వం చట్టం సెక్షన్ 42 ప్రకారం భర్త మరణిస్తే భార్య, పిల్లలకు వారు లేకుంటే తండ్రికి ఆయన లేకుంటే తల్లికి ఆస్తి హక్కు లభిస్తుందని స్పష్టం చేసింది.

చనిపోయిన కొడుకు ఆస్తిలో తల్లికి వాటా ఉంటుందా?: హైకోర్టు సంచలన తీర్పు
New Update

మరణించిన కొడుకు ఆస్తిలో తల్లి వాటకు సబంధించిన కేసులో తమిళనాడులోని మద్రాస్​హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జిల్లా కోర్టులో తల్లికి అనుకూలంగా వచ్చిన తీర్పుపై కోడలు రివ్యూ పిటిషన్ ధాఖలు చేసింది. ఈ క్రమంలో కేసును పరిశీలించిన హైకోర్టు చనిపోయిన కుమారుడి ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదని, అదంతా భార్య, పిల్లలకు మాత్రమే చెందుతుందని స్పష్టం చేసింది.

వివారాల్లోకి వెళితే తమిళనాడులోని నాగపట్టిణంకు చెందిన పౌలిన్ ఇరుదయ మేరీ అనే మహిళకు ఏకైక కుమారుడు మోసెస్. అతనికి 2004లో ఆగ్నస్ అనే మహిళతో మ్యారేజ్ జరగగా ఇటీవల ఓ కూతురు జన్మించింది. ఈ క్రమంలోనే 2012లో చనిపోయిన కుమారుడు మోసెస్ ఆస్తిలో తనకు వాటా కావాలంటూ తల్లి మేరీ నాగపట్టిణం జిల్లా కోర్టును ఆశ్రయించగా మేరీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే నాగపట్టిణం జిల్లా కోర్టు తీర్పును వ్యతిరేకించిన మోసెస్ భార్య ఆగ్నస్.. మద్రాస్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ సుబ్రమణియన్, జస్టిస్ ఎస్ సెంథిల్ కుమార్, పీఎస్ మిత్రా నేశాల నేతృత్వంలో ఈ కేసుపై కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ మేరకు 'వారసత్వ చట్టం సెక్షన్ 42 ప్రకారం చనిపోయిన ఆస్తి తన భార్య, పిల్లలకు మాత్రమే చెందుతుంది. అతనికి పెళ్లికాకపోతే ఆస్తి మొత్తం తండ్రికి చెందుతుంది. తండ్రి లేని సమయంలోనే తల్లి, సోదరులు, సోదరిమణులకు దానిపై హక్కు ఉంటుంది' అని నాగపట్టిణం జిల్లా కోర్టు తీర్పును కొట్టివేసింది.

Also read :కొత్త పార్టీ పెట్టిన హీరో నాని.. మేనిఫెస్టో వీడియో వైరల్

ఇదిలా ఉంటే గతంలో.. కొడుకు చనిపోతే తన ఆస్తిలో తల్లికి కూడా వాటా లభిస్తుందని కర్ణాటక హైకోర్టు తీర్పును ఇచ్చింది. చనిపోయిన కుమారుడి ఆస్తిలో తల్లికి వాటా ఉండదంటూ ఓ జిల్లా ప్రధాన సెషన్స్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీఎన్ సుశీలమ్మ అనే మహిళ హైకోర్టులో వేసిన దావాను జస్టిస్ హెచ్పీ సందేశ్ విచారించారు. చిక్కమగళూరుకు చెందిన ఆమె కొడుకు సంతోష్ మరణించే సమయానికే వారసత్వంగా వచ్చిన ఆస్తిలో తనకు వాటా లభించిందని న్యాయస్థానంలో డిఫెన్స్ న్యాయవాది వాదించగా కుమారుడు చనిపోతే తన ఆస్తిలో తల్లికి కూడా వాటా లభిస్తుందని న్యాయస్థానం తెలిపిన విషయం తెలిసిందే.

#sensational #madras #judgment #high-court
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి