Live In Relationship : సహజీవనం చేశాక విడిపోతే.. పురుషుడు ఆ పని చేయాల్సిందే : హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పురుషుడితో చాలాకాలం పాటు జీవించిన ఒక స్త్రీ.. పెళ్లి చేసుకోకున్నా కూడా అతడి నుంచి విడిపోయినట్లైతే ఆమెకు భరణం పొందే హక్కు ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. By B Aravind 07 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి High Court : ఈమధ్యకాలంలో సహజీవనం(Live In Relationship) అనేది రోజురోజుకు పెరుగుతోంది. పెళ్లి చేసుకోకముందే ఓ పురుషుడు(Man), స్త్రీ(Woman) ఒకే ఇంట్లో ఉంటూ కొంతకాలం పాటు గడుపుతారు. ఆ తర్వాత ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదిరితే పెళ్లి చేసుకుంటారు లేదా విడిపోతారు. అయితే ఈ లివ్ ఇన్ రిలేషన్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టుల సంచలన తీర్పు వెలువరించింది. పురుషుడితో చాలాకాలం పాటు జీవించిన ఒక స్త్రీ.. పెళ్లి చేసుకోకున్నా కూడా అతడి నుంచి విడిపోయినట్లైతే ఆమెకు భరణం పొందే హక్కు ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. Also Read: మహిళలకు ఏడాదికి లక్ష.. రాహుల్ సంచలన ప్రకటన ఇద్దరి సహజీవనం చేసినట్లు రుజువైతే.. బాధిత మహిళకు భరణం పొందే హక్కును తిరస్కరించలేమని తేల్చి చెప్పింది. వాస్తవానికి పెళ్లైన తర్వాత విడిపోతే.. స్త్రీకి భరణం పొందే హక్కు ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండానే.. సహజీవనం చేసి విడిపోయిన కూడా స్త్రీకి పురుషుడు భరణం చెల్లించాల్సిందే. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన శైలేష్ బోప్చే అనే వ్యక్తి.. ఓ మహిళతో చాలాకాలం పాటు సహజీవనం చేశాడు. అంతేకాదు వాళ్లకు సంతానం కూడా కలిగింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో.. గొడవలు పడి ఇద్దరూ విడిపోయారు. అనంతరం తనకు భరణం ఇప్పించాలని బాధిత మహిళ స్థానికంగా ఉండే ట్రయల్ కోర్టు(Trial Court) ను ఆశ్రయించింది. Also Read: విప్రో కొత్త సీఈవో గా శ్రీనివాస్ పల్లియా! దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు.. శైలేష్ బోప్చే ఆమెకు ప్రతినెల రూ.1500 భరణంగా చెల్లించాలంటూ ఆదేశించింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ.. శైలేష్ మధ్యప్రదేశ్ హైకోర్టు(Madhya Pradesh High Court) లో పిటిషన్ వేశాడు. ఆమెకు తనతో పెళ్లి జరగలేదని.. పెళ్లి చేసుకోనప్పుడు భరణం ఎందుకు ఇవ్వాలంటూ కోర్టులో వాదించాడు. అయితే ఇద్దరి మధ్య సహజీవం చాలాకాలం ఉన్నట్లు రుజువైంది కాబట్టి.. ఆమెకు ఇవ్వాల్సిన భరణాన్ని తాము తిరస్కరించలేమని ధర్మాసనం తెలిపింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లు కూడా లివ్ ఇన్ రిలేషన్‌లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. #telugu-news #national-news #madhya-pradesh #live-in-relationship మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి