Madhavi latha: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పాతబస్తీలోని పోలింగ్ కేంద్రాల్లో మాధవీలత ఓవర్ యాక్షన్ చేశారు. ముస్లిం మహిళల బుర్ఖాలు తీసి వారి ఓటర్ స్లిప్ల్ లను చెక్ చేశారు. మాధవీలత(Madhavi Latha) అలా చేయడంపై పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఆమె వినిపించుకోకుండా మిగతా ముస్లిం మహిళలను చెక్ చేశారు. కాగా ఓటు వేసేందుకు వచ్చిన తమకు మాధవీలత వల్ల అవమానం జరిగిందని సదరు మహిళలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం మాధవీలత చేసిన పనిని ఖండించింది. ఆమెపై సీరియస్ అయింది. మాధవీలతపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలు. ఈసీ అదెహస్లా మేరకు మలక్ పేట మాధవీలతపై కేసు నమోదు చేశారు.
నాకు ఆ హక్కుంది..
అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా తనకు ఆ హక్కుంది అంటున్నారు మాధవీలత. ఆర్టీవీకి ఎక్స్లూజివ్‌గా ఇచ్చిన బైట్‌ఓల తానేమీ తప్పు చేయలేదని చెప్పారు. రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో అవతకతవకలు జరిగాయి. దాన్ని ప్రిసీడింగ్ అధికారితో కలిసి చెక్ చేసే హక్కు తనకుందని...అలాగే దొంగోట్లు పడకుండా చెక్ హక్కు కూడా కూదా తనకుందని మాధవీలత అన్నారు. దీంతో పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని...తానె ఎంఐఎంసు ఏమీ అనడం లేదని స్పష్టం చేవారు. ఇదంతా ఎన్నికల అధికారులు నిర్వహణాలోపమని క్లియర్ చేశారు.
Also Read:PITAPURAM: పిఠాపురంలో హైటెన్షన్.. రెచ్చిపోయిన వైసీపీ, జనసేన కార్యకర్తలు!